క్రైమ్ మిర్రర్, విశాఖపట్నం: విశాఖ విమానాశ్రయ సేవలు నిలిచిపోనున్నాయి. నాలుగున్నర దశాబ్దాల సేవలకు తెరపడనుంది. నేటి అర్ధరాత్రి నుంచి విమాన రాకపోకలు బంద్ కానున్నాయి. ఇక పూర్తిగా నేవీ ఆధ్వర్యంలోనే కార్యకలాపాలు సాగనున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో, ప్రత్యేక విమానాలకు మాత్రమే విశాఖ ఎయిర్పోర్ట్లో అనుమతించునున్నారు. ఒకే ఒక్క విమాన రాకపోకతో ప్రారంభమైన విశాఖ ఎయిర్పోర్ట్.. 40 విమాన యాన సేవలకు విస్తరించింది. అంతర్జాతీయ సర్వీసులు అందించే స్థాయికి చేరింది. కానీ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ సేవలు అందుబాటులోకి రావడంతో.. విశాఖ ఎయిర్పోర్ట్ పూర్తిగా మూతపడనుంది.
అందుబాటులోకి భోగాపురం…
Also Read:రోజ్‌మేరీ ఆయిల్‌తో జుట్టుకే కాదు.. మెదడుకు కూడా ప్రయోజనాలేనా? ఇలా వాడితేనే సేఫ్…!
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈనెల 1న ప్రధాని నరేంద్ర మోడీ ఈ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేశారు. అయితే అధికారికంగా విమాన రాకపోకలు 17 నుంచి ప్రారంభం అవుతాయని పౌర విమానయాన శాఖ ప్రకటించింది. ఈరోజు అర్ధరాత్రి నుంచి విమాన రాకపోకలు ప్రారంభం కానున్నాయి. అదే సమయంలో విశాఖ విమానాశ్రయం నుంచి వాణిజ్య విమానాల రాకపోకలు నిలిచిపోతాయి. నావి ఆధీనంలోకి వెళ్లి పోతుంది ఆ ఎయిర్ పోర్ట్. ప్రత్యేక పరిస్థితులు, ప్రముఖులు ఆకస్మికంగా సందర్శనకు వచ్చినప్పుడు మాత్రమే ఆ ఎయిర్ పోర్టు పనిచేయనుంది.
సుదీర్ఘ చరిత్ర…
Also Read:గురుకులంలో అర్ధరాత్రి ర్యాగింగ్ కలకలం.. పదో తరగతి విద్యార్థులపై ఇంటర్ స్టూడెంట్స్ దాడి
విశాఖ ఎయిర్పోర్ట్ కు సుదీర్ఘ చరిత్ర ఉంది. రోజుకు ఒక్క విమాన రాకపోక తో ప్రారంభమైన ఈ విమానాశ్రయం.. ఇప్పుడు 40 విమానాలు వచ్చి, తిరిగి వెళ్లే స్థాయికి చేరింది. కొత్త అంతర్జాతీయ సర్వీస్ లను సైతం ప్రజలకు పరిచయం చేసింది. 1941 రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆంగ్లేయులు రాయల్ ఎయిర్ ఫోర్స్ కోసం ఇక్కడ చిన్న రన్వే నిర్మించారు. యుద్ధం ముగిశాక దాని అవసరం లేకుండా పోయింది. తిరిగి 1962లో పౌర విమానాల కోసం దానిని వినియోగంలోకి తెచ్చారు. కానీ పూర్తి స్థాయిలో నిర్వహించలేకపోయారు. ఇంతలో 1972లో ఇదే రన్వే ను రక్షణ అవసరాలకు ఉపయోగించుకోవడం ప్రారంభించారు. విశాఖలో తూర్పునౌకాదళం కార్యకలాపాలు విస్తృతం కావడంతో.. 1986లో ఆ రన్ వేను, భూములను రక్షణ శాఖకు బదిలీ చేశారు. అప్పటినుంచి పౌర విమాన యానంలో సేవలు అందిస్తోంది.
గణనీయమైన విస్తరణ…
Also Read:Akshay Kumar: అక్షయ్ కుమార్ తెలుగు సినిమాలోకి ఎంట్రీ.. రానాతో కలిసి క్రేజీ ప్రాజెక్ట్…?
ప్రారంభంలో విశాఖ విమానాశ్రయం నుంచి రోజుకు ఒకటే విమానం వచ్చి వెళ్ళేది. ఒకవేళ వాతావరణం అనుకూలంగా లేకపోతే అది కూడా రద్దయేది. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ ఎయిర్పోర్ట్ అభివృద్ధి జరుగుతూ వచ్చింది. క్రమేపి విమానాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండడంతో రన్వే తో పాటు ఇతర సౌకర్యాలను సమకూర్చారు. మూడు వేల మీటర్ల పొడవైన రన్వే ఏర్పాటు చేశారు. 2007 తర్వాత నైట్ లాండింగ్ సదుపాయం కూడా కల్పించారు. 2008లో ప్రత్యేకంగా ఒక టెర్మినల్ నిర్మించారు. దీంతో అంతర్జాతీయ సర్వీసులు కూడా ప్రారంభం అయ్యాయి. కానీ ఒకవైపు నావి విమానాలు, ఇంకోవైపు వాణిజ్య విమాన రాకపోకలతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. నావికాదళం నుంచి అభ్యంతరాలు రావడంతో.. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం పట్టాలెక్కింది. ఆ ఎయిర్పోర్ట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడంతో ఇప్పుడు విశాఖ విమానాశ్రయం మూతపడింది. కేవలం నేవీ కి సంబంధించి విమాన రాకపోకలు జరగనున్నాయి. అయితే అత్యవసర పరిస్థితులు, ప్రముఖుల పర్యటన సమయంలో మాత్రం ఈ విమానాశ్రయం సేవలందిస్తుంది.
