Homeక్రైమ్అయోధ్యలో ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లోకి ఎగిరిపడిన వ్యక్తి- CCTVలో దృశ్యాలు

అయోధ్యలో ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లోకి ఎగిరిపడిన వ్యక్తి- CCTVలో దృశ్యాలు

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. ఇప్పటికే మరో వాహనాన్ని ఢీకొట్టిన ఓ కారు.. ఆగకుండా వేగంగా దూసుకెళ్లింది. ఈ క్రమంలో రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తిని కారు బలంగా ఢీకొట్టింది.

కారు ఢీకొనడంతో బాధితుడు ఒక్కసారిగా గాల్లోకి పలుమార్లు ఎగిరి రోడ్డుపై పడిపోయాడు. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. వెంటనే స్థానికులు గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. ప్రమాదం తర్వాత కారు డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న కారు డ్రైవర్‌ను గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టారు.

సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా వాహనం, డ్రైవర్ వివరాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

also read: కిష్త్వార్‌లో ఘోర ప్రమాదం.. చీనాబ్ నదిలో పడిన స్కార్పియో, ఐదుగురు మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు