Homeతెలంగాణ"వర్షాలు పడొద్దని అఘోరా పూజలు": ప్రతిపక్షాలపై సీఎం రేవంత్

“వర్షాలు పడొద్దని అఘోరా పూజలు”: ప్రతిపక్షాలపై సీఎం రేవంత్

క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణలో వర్షాలు కురవకూడదని, రాష్ట్రంలో కరువు రావాలని కోరుకుంటూ కొందరు అఘోరా పూజలు, చేతబడులు చేయిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలనే కుట్రతోనే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.హైదరాబాద్‌లో ఇందిరమ్మ టవర్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “ఎల్ నినో ప్రభావం ఉన్నప్పటికీ, దేవుడి దయ వల్ల ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండింది. కానీ, కొంతమంది మాత్రం రాష్ట్రంలో కరువు రావాలని కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు వెళ్లి మరీ అఘోరా పూజలు చేయించారు. ఇలాంటి దుర్మార్గులు కూడా మన మధ్యే ఉన్నారు,” అని ఆయన ఆరోపించారు.అయినప్పటికీ, తన సంకల్పం మంచిది కాబట్టి దేవుడు తనవైపే ఉన్నాడని, ఇలాంటి కుట్రలు ఫలించవని సీఎం ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని, ఇలాంటి అవాంతరాలను అధిగమించి ముందుకు సాగుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కలకలం.. ప్రయాణికుడి బ్యాగులో కోతి పుర్రె!

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కలకలం.. ప్రయాణికుడి బ్యాగులో కోతి పుర్రె!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు