Homeతెలంగాణతెలంగాణలో రానున్న రెండు రోజులు వానలే వానలు!

తెలంగాణలో రానున్న రెండు రోజులు వానలే వానలు!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గత కొద్ది రోజులుగా అస్థిరంగా ఉన్న వాతావరణం, ఇప్పుడు భారీ వర్షాలకు దారి తీసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా పొరుగు రాష్ట్రంలో ఏర్పడిన వాతావరణ మార్పుల వల్ల తెలంగాణపై ఈ ప్రభావం పడనుందని స్పష్టం చేశారు.

ఇవాళ చెదురుముదురు వర్షాలు..వాతావరణ నిపుణుల తాజా సమాచారం ప్రకారం.. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు చెదురుముదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. అయితే, అసలు వాతావరణ మార్పు రేపు జరగనుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రం మరియు దాని పరిసర ప్రాంతాల్లో తాజాగా ఒక అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడన ప్రభావం తెలంగాణ వైపు విస్తరిస్తున్నందున, రేపు రాష్ట్రంలో వర్షాల తీవ్రత ఒక్కసారిగా పెరగనుందని అధికారులు తెలిపారు.మధ్యప్రదేశ్‌లో ఏర్పడిన అల్పపీడన ప్రభావం ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలపై తీవ్రంగా ఉండనుంది.

రేపు ఈ క్రింది జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆదిలాబాద్
కొమరంభీమ్
ఆసిఫాబాద్
మంచిర్యాల
నిర్మల్
నిజామాబాద్
కామారెడ్డి
కరీంనగర్
రాజన్న సిరిసిల్ల
పెద్దపల్లి
జగిత్యాల
ఈ జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రైతులు తమ పంటల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రయాణాలు చేసేవారు వాతావరణ పరిస్థితిని చూసుకుని బయలుదేరాలని అధికారులు సూచిస్తున్నారు.

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కలకలం.. ప్రయాణికుడి బ్యాగులో కోతి పుర్రె!

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన జూనియర్ ఎన్టీఆర్‌.. 2- 3 నెలలు విశ్రాంతి అవసరమని వైద్యుల సూచన

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు