Homeఆంధ్ర ప్రదేశ్ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా చిరంజీవి..ఇదే మెగాస్టార్ టీమ్ ఫుల్ క్లారిటీ!

ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా చిరంజీవి..ఇదే మెగాస్టార్ టీమ్ ఫుల్ క్లారిటీ!

గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఓ వార్త వైరల్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా ఆయనను నియమించనున్నారని, రాష్ట్ర పర్యాటక రంగం, పెట్టుబడుల ప్రోత్సాహం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోబోతోందని పలు కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ వార్త అభిమానుల్లోనూ, సినీ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.అయితే ఈ ప్రచారంపై తాజాగా చిరంజీవి బృందం అధికారికంగా స్పందించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. చిరంజీవిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తున్నారన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, ఇప్పటివరకు అలాంటి ఎలాంటి అధికారిక నిర్ణయం లేదని వెల్లడించింది.ఈ విషయాన్ని మెగాస్టార్ టీమ్ అధికారికంగా ఎక్స్ (X) వేదికగా తెలియజేసింది. ధృవీకరణ లేని వార్తలను నమ్మకూడదని, వాటిని మరింతగా షేర్ చేయకుండా జాగ్రత్త వహించాలని అభిమానులు, ప్రజలకు విజ్ఞప్తి చేసింది. దీంతో రెండు రోజులుగా కొనసాగుతున్న ఊహాగానాలకు తెరపడినట్టైంది.ఇక సినిమాల విషయానికి వస్తే, రీఎంట్రీ తర్వాత చిరంజీవి వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న మెగా 158 చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాపై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

బన్నీ-లోకేష్ మూవీలో విలన్‌గా బాలీవుడ్ స్టార్ హీరో ఎంట్రీ..!

మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న మెగా 158 టైటిల్ టీజర్ విడుదల కానుందని చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. అదే రోజున మరో ప్రతిష్టాత్మక చిత్రం విశ్వంభర విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సోషియో ఫాంటసీ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.మరోవైపు దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో చిరంజీవి మరో భారీ ప్రాజెక్ట్ చేయనున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని హీరో నాని నిర్మించనున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మొత్తానికి బ్రాండ్ అంబాసిడర్ వార్తలకు మెగాస్టార్ టీమ్ క్లారిటీ ఇవ్వడంతో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఫుల్‌స్టాప్ పడింది.

చేనేత పథకాలపై కేటీఆర్ ఫైర్.. నేతన్నలకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి డిమాండ్

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు