Homeక్రైమ్హైడ్రా కమిషనర్ సంతకం ఫోర్జరీ: 8 ప్రైవేట్ కాలేజీలపై కేసు నమోదు

హైడ్రా కమిషనర్ సంతకం ఫోర్జరీ: 8 ప్రైవేట్ కాలేజీలపై కేసు నమోదు

హైదరాబాద్‌లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలు సమర్పించిన వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దాదాపు ఎనిమిది ప్రైవేట్ కాలేజీలు హైడ్రా పేరును దుర్వినియోగం చేస్తూ నకిలీ ఫైర్ ఎన్‌వోసీలు (NOC) సృష్టించినట్లు అధికారులు గుర్తించారు.

ఈ నకిలీ పత్రాలను సంబంధిత కాలేజీలు ఇంటర్మీడియట్ బోర్డుకు సమర్పించాయి. పత్రాలపై అనుమానం కలగడంతో అధికారులు ప్రత్యేకంగా పరిశీలించగా.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసినట్లు నిర్ధారణకు వచ్చారు.

ఈ ఘటనపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు, నకిలీ పత్రాలు సమర్పించిన ఎనిమిది ప్రైవేట్ కాలేజీల గుర్తింపును రద్దు చేయాలని సూచించారు. అలాగే ఈ కేసులో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికార వర్గాలు నిర్ణయించాయి.

ఇక ఈ వ్యవహారంపై లేక్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఫోర్జరీ, నకిలీ పత్రాల సృష్టి, అధికార ముద్ర దుర్వినియోగం వంటి కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

also read: స్నేహితులే మోసం చేశారు- వేధింపులు భరించలేక యువకుడి ఆత్మహత్య

తాజావార్తలు