Homeక్రైమ్నడిరోడ్డుపై దారుణ హత్య.. కొబ్బరికాయలు కొట్టే కత్తితో దాడి

నడిరోడ్డుపై దారుణ హత్య.. కొబ్బరికాయలు కొట్టే కత్తితో దాడి

క్రైమ్ మిర్రర్ : హైదరాబాద్‌లోని సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నడిరోడ్డుపై జరిగిన హత్య స్థానికంగా కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేయడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఘటన అనంతరం నిందితుడు పరారవగా, అతడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. సింగరేణి కాలనీకి చెందిన హమేర్ (35)పై ఓ యువకుడు కొబ్బరికాయలు కొట్టేందుకు ఉపయోగించే కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో హమేర్ తీవ్రంగా గాయపడగా, స్థానికులు వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అక్కడ లభ్యమైన ఆధారాలను సేకరించడంతో పాటు ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశారు. నిందితుడు ఘటన అనంతరం పరారైనట్లు గుర్తించిన పోలీసులు అతడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. మృతుడిపై గతంలో కొన్ని క్రిమినల్ కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ హత్య వ్యక్తిగత విభేదాల ఫలితమా, లేక ఇతర కారణాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఇదిలా ఉండగా, మృతుడు, నిందితుడు ఇద్దరికీ గంజాయి ముఠాలతో సంబంధాలు ఉన్నాయనే ప్రచారం స్థానికంగా సాగుతోంది. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
also read : అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో చిక్కుకుని మహిళ దుర్మరణం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు