Homeజాతీయంటీచర్లకు టెట్ తప్పనిసరి… గడువు 2028 ఆగస్టు 31 వరకు పొడిగింపు

టీచర్లకు టెట్ తప్పనిసరి… గడువు 2028 ఆగస్టు 31 వరకు పొడిగింపు

దేశవ్యాప్తంగా ఉపాధ్యాయుల నియామకాల్లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) అర్హత తప్పనిసరి అనే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. టెట్ అర్హత పొందేందుకు గడువును 2028 ఆగస్టు 31 వరకు పొడిగించినట్టు పార్లమెంట్‌కు తెలియజేసింది.

ఈ విషయాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి లోక్‌సభలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిస్తూ వెల్లడించారు. టీచర్లకు టెట్ అర్హత తప్పనిసరి అని 2025 సెప్టెంబర్ 1న సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని ఆయన తెలిపారు. మొదటగా 2027 ఆగస్టు 31 వరకు గడువు నిర్ణయించినప్పటికీ, అనంతరం దాఖలైన రివ్యూ పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆ గడువును 2028 ఆగస్టు 31 వరకు పొడిగించినట్టు వివరించారు.

టెట్ అర్హత ఇంకా పొందని ఉపాధ్యాయుల కోసం ప్రతి ఏడాది కనీసం రెండు సార్లు పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు సూచించిందని మంత్రి పేర్కొన్నారు. ఈ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నాయని తెలిపారు.

దేశవ్యాప్తంగా ఉపాధ్యాయుల నాణ్యతను పెంచడంలో భాగంగా టెట్ అర్హతను తప్పనిసరి చేసినట్లు కేంద్రం స్పష్టం చేసింది. దీంతో ఇంకా అర్హత సాధించని ఉపాధ్యాయులు నిర్దేశిత గడువులోగా పరీక్షలో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది.

also read: డీప్‌ఫేక్ దుమారం: మృణాల్ ఠాకూర్ ఆగ్రహం.. లీగల్ యాక్షన్ హెచ్చరిక!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు