నేచురల్ స్టార్ నాని అభిమానులకు గుడ్ న్యూస్. నాని హీరోగా తెరకెక్కుతున్న భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ నుంచి కీలక అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా టీజర్‌ను ఆగస్టు 6న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
దాదాపు 1 నిమిషం 35 సెకన్ల నిడివితో ఉండే ఈ టీజర్‌లో సినిమా నేపథ్యం, కథలోని ప్రధాన అంశాలు, పాత్రల భావోద్వేగాలను ప్రేక్షకులకు పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా.. తాజా టీజర్ ప్రకటనతో ఆసక్తి మరింత పెరిగింది.
‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాని మరో విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారని సమాచారం. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మూవీలో మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు, కయాదు లోహర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ముందుగా ఈ చిత్రాన్ని ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావించారు. అయితే విడుదల తేదీలో మార్పు వచ్చే అవకాశాలు ఉన్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
నాని కెరీర్‌లో మరో ప్రత్యేకమైన చిత్రంగా నిలవబోతున్న ‘ది ప్యారడైజ్’ టీజర్ ఎలా ఉండబోతుందో చూడాలంటే ఆగస్టు 6 వరకు వేచి చూడాల్సిందే.
also read: “నేను కూడా బాధితురాలినే”- నీట్ పేపర్ లీక్‌పై మానుషి చిల్లర్ స్పందన..
