Homeక్రైమ్యూనిఫామ్ ముసుగులో దారుణం.. చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన కానిస్టేబుల్

యూనిఫామ్ ముసుగులో దారుణం.. చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన కానిస్టేబుల్

క్రైమ్ మిర్రర్ : పోలీసు యూనిఫామ్‌పై ఉన్న నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తూ ఓ కానిస్టేబుల్ దారుణానికి ఒడిగట్టాడు. ఇంటి వద్ద దింపుతానని నమ్మించి 10 ఏళ్ల బాలికను బైక్‌పై తీసుకెళ్లి, అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లాలో కలకలం రేపింది. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 28న బాధిత బాలిక ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన అక్కకు ఆహారం అందించి తిరిగి ఇంటికి వెళ్లేందుకు ఆసుపత్రి నుంచి బయటకు వచ్చింది. అదే సమయంలో డయల్-112 విభాగంలో విధులు నిర్వహిస్తున్న 35 ఏళ్ల కానిస్టేబుల్ అభిషేక్ యాదవ్ ఆమెను గమనించాడు. పోలీసు దుస్తుల్లో ఉండటంతో అతడిని నమ్మిన బాలిక బైక్‌పై ఎక్కింది.

అయితే ఇంటికి తీసుకెళ్లాల్సిన అతడు బాలికను సుమారు 15 కిలోమీటర్ల దూరంలోని శ్మశానవాటిక ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై లైంగిక దాడికి పాల్పడి, అనంతరం హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. నేరాన్ని దాచిపెట్టేందుకు బాలిక మృతదేహాన్ని సమీప నదిలో పడేసినట్లు పోలీసులు వెల్లడించారు. బాలిక కనిపించకపోవడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విస్తృతంగా దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఆసుపత్రి పరిసరాలతో పాటు వివిధ ప్రాంతాల్లోని దాదాపు 200 సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించగా, కానిస్టేబుల్ అభిషేక్ యాదవ్ బాలికను బైక్‌పై తీసుకెళ్తున్న దృశ్యాలు లభించాయి. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అతడి సమాచారంతో గురువారం ఉదయం నదిలో గాలింపు చేపట్టి బాలిక మృతదేహాన్ని వెలికితీశారు.

అరెస్ట్ అనంతరం వైద్య పరీక్షల కోసం అభిషేక్ యాదవ్‌ను ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లగా, అక్కడి వైద్యులు, నర్సులు, ఆసుపత్రి సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతడిపై దాడికి యత్నించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితుడిని వెంటనే అక్కడి నుంచి తరలించారు. పోలీసు అధికారుల వివరాల ప్రకారం, అభిషేక్ యాదవ్‌పై గతంలో కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నాయి. 2025లో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అతడు సస్పెండ్ కావడంతో పాటు జైలుకు వెళ్లాడు. అనంతరం బెయిల్‌పై విడుదలై తిరిగి విధుల్లో చేరినట్లు వెల్లడించారు. తాజా ఘటన నేపథ్యంలో అతడిని పోలీసు సేవల నుంచి తొలగించాలని ఉన్నతాధికారులు సిఫార్సు చేశారు. అలాగే జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) కింద కూడా చర్యలు తీసుకునే ప్రక్రియ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
also read : కన్న కూతురిపైనే ఏడాది పాటు లైంగిక దాడి.. పోక్సో కేసులో తండ్రికి రిమాండ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు