భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. నీట్ పరీక్షలో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పంకెన గ్రామానికి చెందిన వైష్ణవి ఇటీవల నిర్వహించిన నీట్ పరీక్షలో తక్కువ మార్కులు రావడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది.
ఈ నేపథ్యంలో మంగళవారం ఆమె గడ్డి మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి ఆమెను హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం వైష్ణవి మృతి చెందింది.
ఈ ఘటనపై కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. నీట్‌లో ఆశించిన ర్యాంకు రాకపోవడంతోనే ఆమె ఈ దురదృష్టకర నిర్ణయం తీసుకుందని మృతురాలి తండ్రి రాజయ్య తెలిపారు.
also read: కాలు విరిగిన మహిళకు హార్ట్ సర్జరీ?- హర్యానాలో షాకింగ్ ఘటన
