క్రైమ్ మిర్రర్, సినిమా:- ప్రస్తుతం రాకా సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. హైదరాబాద్‌లో జరిగిన Allu Arjun Fans Association (AAFA) సమావేశంలో పాల్గొన్న ఆయన.. అభిమానుల ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియాలో పెరుగుతున్న ట్రోలింగ్, ఫ్యాన్ వార్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సమయం, శక్తి విలువను రూ.100 ఉదాహరణతో వివరించడం అభిమానులను ఆకట్టుకుంది.ఇటీవల సోషల్ మీడియాలో హీరోల అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్, నెగెటివ్ కామెంట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ అంశాన్ని ప్రస్తావించిన అల్లు అర్జున్.. నచ్చని వ్యక్తుల గురించి ఆలోచిస్తూ విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు. ద్వేషం కంటే మన లక్ష్యాలు, ఎదుగుదల ముఖ్యమని అభిమానులకు సందేశం ఇచ్చారు.
అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ, మీకు ఎవరైనా నచ్చకపోతే వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. రూ.100 ఉదాహరణతో తన సందేశాన్ని వివరించిన ఆయన.. మనకు నచ్చని వస్తువు కోసం డబ్బు ఖర్చు చేయనట్లే, నచ్చని వ్యక్తుల కోసం సమయం, శక్తిని కూడా ఖర్చు చేయకూడదన్నారు. ఆ సమయాన్ని మన అభివృద్ధికి ఉపయోగించుకోవాలని సూచించారు.
మధ్యలో సరదాగా మాట్లాడుతూ, మీకు నచ్చిన పని చేయండి, జీవితాన్ని ఆనందంగా గడపండి అంటూ అభిమానులను నవ్వించారు. అలాగే ప్రతి రోజూ మన జీవితాన్ని పూర్తిగా చార్జ్ అయిన బ్యాటరీతో పోలుస్తూ, ఆ రోజంతా ఉన్న శక్తిని ఎక్కడ వినియోగించాలో మనమే నిర్ణయించుకోవాలని చెప్పారు. జీవితానికి ఉపయోగపడే పనులకే సమయం, శక్తి వెచ్చిస్తేనే విజయాలు సాధించగలమని వివరించారు.అల్లు అర్జున్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా ట్రోలింగ్ కల్చర్, ఫ్యాన్ వార్స్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అభిమానులు కూడా ఆయన సందేశాన్ని ప్రశంసిస్తూ, సోషల్ మీడియాలో అనవసరమైన వాదోపవాదాల కంటే వ్యక్తిగత ఎదుగుదలపై దృష్టి పెట్టాలన్న సూచనను స్వాగతిస్తున్నారు.
ఉదయాన్నే ఇవి గిన్నెడు తింటే.. .. రోజంతా ఎనర్జీ, ఆరోగ్యానికి సూపర్ ఫుడ్!
