హర్యానా రాష్ట్రంలోని పానిపట్లో వైద్య నిర్లక్ష్యం ఆరోపణలతో ఒక విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. రోడ్డు ప్రమాదంలో గాయపడి కాలు విరిగిన గుడ్డిదేవి అనే మహిళ చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లగా, అక్కడ జరిగిన వైద్య చర్యలపై తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
కుటుంబ సభ్యుల ప్రకారం, కాలుకు చికిత్స చేయాలని ఆసుపత్రికి వెళ్లగా వైద్యులు గుడ్డిదేవికి హార్ట్ సర్జరీ చేసినట్లు వారు ఆరోపిస్తున్నారు. ఈ అనుమానాస్పద వైద్య ప్రక్రియ తర్వాత ఆమె ఆరోగ్యం మరింత విషమించి, చివరకు ప్రాణాలు కోల్పోయింది.
ఈ ఘటనపై బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించగా, పూర్తి వివరాలు రిపోర్టులు వచ్చిన తర్వాత వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. వైద్య సేవల నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
also read: తిరుపతిలో సంచలనం: లాడ్జిలో మహిళ మృతదేహం– భర్తపై అనుమానం
