Homeసినిమావిశాల్ రాజకీయాల్లోకి ఎంట్రీ? తమిళనాడులో వేడెక్కుతున్న చర్చలు 

విశాల్ రాజకీయాల్లోకి ఎంట్రీ? తమిళనాడులో వేడెక్కుతున్న చర్చలు 

తమిళ సినిమా పరిశ్రమలో స్టార్ హీరోలు రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే కొంతమంది ప్రముఖ నటులు రాజకీయ రంగంలోకి ప్రవేశించి తమదైన గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. ప్రజెంట్ అదే రూట్ లో మరో మాస్ హీరో అడుగులు వేయబోతున్నారనే చర్చలు ఊపందుకున్నాయి.

తాజాగా జరిగిన ఓ బహిరంగ కార్యక్రమంలో నటుడు విశాల్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయ వర్గాల్లోనే కాకుండా సినీ అభిమానుల్లో కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తనకు అభిమానులు అందించిన ప్రేమ, ఆదరణకు.. సమాజానికి ఏదైనా చేయాలని బలమైన సంకల్పం ఏర్పడిందని ఆయన చెప్పారు.

“ఇండస్ట్రీలో నటుడిగా నాకు లభించిన గుర్తింపు, అభిమానాన్ని ప్రజల సేవ కోసం ఉపయోగించాలనే ఆలోచన కలిగింది. ఇకపై నా ప్రయాణం కేవలం సినిమాలకే పరిమితం కాకుండా, ప్రజల మధ్యకు చేరి వారి సమస్యలు తెలుసుకుని సహాయం చేసే దిశగా సాగుతుంది” అని విశాల్ పేర్కొన్నారు.

సినిమా రంగంలోనే కాకుండా, నడిగర్ సంగం, ప్రొడ్యూసర్ కౌన్సిల్ వంటి సంస్థల్లో బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం విశాల్‌కు ఉంది. గతంలో కూడా ఆయన రాజకీయాల్లోకి రావాలనే సంకేతాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ప్రజలకు అవసరమైన సేవలు అందకపోతే కొత్త నాయకత్వం ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

తన అభిమాన సంఘాన్ని కూడా సేవా కార్యక్రమాలకు ఉపయోగించాలనే ఉద్దేశం ఉందని, భవిష్యత్తులో తన రాజకీయ ప్రణాళికలపై స్పష్టత ఇస్తానని విశాల్ తెలిపారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే, త్వరలోనే పూర్తి స్థాయి రాజకీయ ప్రస్థానం ప్రారంభించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. విశాల్ తీసుకునే తదుపరి నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

also read: అంతరిక్షంలో యోగా.. వైరల్ అవుతున్న వ్యోమగామి విన్యాసాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు