క్రైమ్ మిర్రర్, జాతీయం:- తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలంలో ఉన్న ఇడుక్కు పిళ్లయార్ (గణేశ్ టెంపుల్) మోక్షమార్గానికి సంబంధించి ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మోక్షమార్గం ప్రవేశంపై కొత్త నియమ నిబంధనలను అమలులోకి తెచ్చారు.చాలా ఇరుకుగా ఉండే ఈ మార్గంలోకి ప్రవేశించేందుకు ఇకపై అందరికీ అనుమతి ఉండదు. ముఖ్యంగా ఊబకాయం (అధిక బరువు) ఉన్నవారు, వృద్ధులు, మరియు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఈ మోక్షమార్గంలోకి ప్రవేశించరాదని అధికారులు స్పష్టం చేశారు.ఇరుకైన మార్గం కావడంతో లోపల ఇరుక్కుపోయే ప్రమాదం ఉందన్న ఆందోళనల దృష్ట్యా, అలాగే ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆలయ సిబ్బందికి సహకరించాలని కోరారు.
నేడు, రేపు సింహాచలంలో ఘనంగా గిరిప్రదక్షిణ.. ఆ స్కూళ్లకు సెలవు!
కేంద్ర విద్యాశాఖ మంత్రిగా దగ్గుపాటి పురందేశ్వరీ…?
