క్రైంమ్ మిర్రర్ : జనసేన పార్టీ రాజంపేట సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ శివకుమార్ (48) తిరుపతిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం నూనెవారిపల్లికి చెందిన శివకుమార్ కొంతకాలంగా తిరుపతిలో తన బంధువు చింతల రమణమూర్తి నివాసంలో ఉంటున్నారు.
సోమవారం ఆయన ఇంట్లోని బాత్రూమ్‌లోకి వెళ్లిన తర్వాత చాలా సేపు బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానించారు. తలుపు తెరిచి చూడగా ఆయన అపస్మారక స్థితిలో కనిపించడంతో వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.ఈ ఘటనపై మృతుడి భార్య కళ్యాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
also read :యూపీలో దారుణం.. ఐదేళ్ల బాలుడిపై ఉపాధ్యాయురాలి వేధింపులు
