Homeక్రైమ్సీఎం చంద్రబాబుతో కలిసి భోజనం చేసిన విద్యార్థిని మృతి..

సీఎం చంద్రబాబుతో కలిసి భోజనం చేసిన విద్యార్థిని మృతి..

క్రైం మిర్రర్: అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం ఇర్లపల్లి గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని ముర్రం శివాని ఉరివేసుకుని మృతి చెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, మృతికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

శివాని ఇటీవల రంపచోడవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ‘తల్లికి వందనం’ కార్యక్రమంలో పాల్గొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో మాట్లాడింది. చదువులో ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థినిగా ఆమెను పాఠశాల ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఆమె ఆకస్మిక మృతి కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులను తీవ్ర విషాదంలోకి నెట్టింది.

శివాని మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం

విద్యార్థిని శివాని మృతిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న శివాని మృతి బాధాకరమని పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అలాగే, సమస్యలు ఎదురైనప్పుడు విద్యార్థులు కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు లేదా ఆత్మీయులతో మాట్లాడాలని, ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుందని, ధైర్యంగా ముందుకు సాగాలని ముఖ్యమంత్రి సూచించారు.
also read :టీడీపీలోకి వల్లభనేని వంశీ మోహన్…?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు