-
పట్టిసీమ ప్రాజెక్టు భేష్ అంటూ కామెంట్స్
-
ముఖ్యమంత్రి గారు అంటూ చంద్రబాబు పట్ల గౌరవభావం
-
మారిన వివాదాస్పద నేత వైఖరి
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: వల్లభనేని వంశీ మోహన్ మనసు మారుతోందా? ఆయన తిరిగి టిడిపికి దగ్గరవుతారా? తన తప్పు తెలుసుకున్నారా? అందుకే చంద్రబాబును గౌరవిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ఇటీవల పట్టిసీమ ప్రాజెక్టు విషయంపై సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు వల్లభనేని వంశీ మోహన్. అందులో ముఖ్య మంత్రి గారు అంటూ గౌరవిస్తూనే.. ఒక విన్నపం కూడా చేశారు. పట్టిసీమ పథకం భేష్ అని కొనియాడారు. గన్నవరం నియోజకవర్గానికి పట్టిసీమ నీరు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఇదే పట్టిసీమను వైసీపీ వ్యతిరేకించింది. ఇప్పుడు దానిని కొనియాడడమే కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల గౌరవంగా వ్యవహరిస్తున్నారు వల్లభనేని వంశీ మోహన్. ఈ లెక్కన ఆయన త్వరలో టిడిపిలో చేరుతారని తెగ ప్రచారం నడుస్తోంది.
తరచూ వివాదాస్పద కామెంట్స్…
Also Read:స్నానానికి చల్లటి నీళ్లా? వేడి నీళ్లా? ఏది బెస్ట్! – వైద్యుల సలహా ఇదే
వల్లభనేని వంశీ మోహన్ రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందడానికి ఆయన చేసే కామెంట్స్ కారణం. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు తో పాటు లోకేష్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసేవారు వల్లభనేని వంశీ మోహన్. ఒక విషయంలో చంద్రబాబు సతీమణిని కూడా దూషించారు. అప్పట్లో చంద్రబాబు శాసనసభ నుంచి వాకౌట్ చేయడానికి కూడా వల్లభనేని వంశీ కారణం. కొడాలి నాని తో కలిసి వల్లభనేని వంశీ మోహన్ చంద్రబాబును టార్గెట్ చేసుకునేవారు. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు పై వారిద్దరిని ప్రయోగించేవారు. కానీ మొన్నటి ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి చేతిలో దారుణంగా ఓడిపోయారు వల్లభనేని వంశీ మోహన్. అప్పటినుంచి ఆయన వైఖరిలో మార్పు వచ్చింది. కేసుల్లో ఇరుక్కున్నారు. దాదాపు 150 రోజుల వరకు రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. అయితే బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత ఆయన తన వ్యాఖ్యలను, వాటి తీవ్రతను తగ్గించుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు పట్ల గౌరవభావంతో మెలుగుతుండడంతో తిరిగి టిడిపికి దగ్గర అవుతారన్న ప్రచారం నడుస్తోంది.
టిడిపి ద్వారా ఎంట్రీ…
Also Read:రాజ్-డీకే కొత్త లేడీ ఓరియెంటెడ్ మూవీ.. నేషనల్ క్రష్‌తో మరో భారీ ప్రాజెక్ట్?
వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు వల్లభనేని వంశీ మోహన్. 2009లో తొలిసారిగా విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అటు తరువాత జూనియర్ ఎన్టీఆర్ ప్రోత్సాహంతో గన్నవరం టిడిపి టికెట్ ను దక్కించుకున్నారు 2014లో. ఆ ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2019లో జగన్ ప్రభంజనంలో సైతం విజయం దక్కించుకున్నారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన కొద్ది కాలానికి ఆయన వైసీపీలోకి ఫిరాయించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత చంద్రబాబుతో పాటు లోకేష్ ను టార్గెట్ చేసుకున్నారు. వారిద్దరి విషయంలో దారుణంగా వ్యాఖ్యానాలు చేసేవారు. అందుకు మూల్యం చెల్లించుకున్నారు. కూటమి వచ్చిన తర్వాత అరెస్టు అయ్యారు. బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత ఆయన వైఖరిలో మార్పు వచ్చింది. ఇప్పుడు టిడిపికి దగ్గరవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.
