హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్: తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి వైఖరి ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటుండటం, అధికార కాంగ్రెస్ నేతలతోనూ, బీజేపీ అగ్రనేతలతోనూ ఆయన జరిపిన భేటీలతో మల్లారెడ్డి పార్టీ మారడం ఖాయమనే ప్రచారం జోరుగా సాగింది. కానీ ఎప్పుడూ ఆయన బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పానని మాత్రం చెప్పలేదు. ఆ పార్టీలోనే ఉంటానని అంటూంటారు.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా బోయిన్‌పల్లిలోని తన కార్యాలయంలో వేడుకలు నిర్వహించి తాను ఎప్పటికీ బీఆర్ఎస్‌లోనే ఉంటానని స్పష్టం చేశారు. కానీ, అక్కడ ఆయన ప్రదర్శించిన హావభావాలు, వాతావరణం చూసిన రాజకీయ విశ్లేషకులు ఇది పక్కా డబుల్ గేమ్ అని క్లారిటీకి వచ్చేశారు.
కేటీఆర్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న మల్లారెడ్డి మెడలో గులాబీ రంగు కండువా ఉన్నప్పటికీ, దానిపై ఎలాంటి బీఆర్ఎస్ పార్టీ గుర్తులు లేవు.
Also Read:విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడుతోంది…!
అంతేకాకుండా, ఆయన కార్యాలయం వద్ద సాధారణంగా కనిపించే జెండాలు, కేసీఆర్, కేటీఆర్‌ల భారీ కటౌట్లు లేకుండా కేవలం ఒక సాధారణ శుభాకాంక్షల బోర్డుతోనే సర్దేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. బీఆర్ఎస్ పార్టీని వీడే ఆలోచన లేదని పైకి చెబుతున్నా, పార్టీ చిహ్నాలను పక్కన పెట్టడం వెనుక అధిష్ఠానానికి ఒక రకమైన సిగ్నల్ ఇస్తున్నారా అనే చర్చ క్యాడర్‌లో మొదలైంది. ఈ పరిణామాలకు ముందు, మల్లారెడ్డి వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఒక బీఆర్ఎస్ కార్యకర్త రక్తంతో లేఖ రాయడం పెద్ద కలకలమే రేపింది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని పదవులు, అవకాశాలు అనుభవించి.. ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే పార్టీకి, కార్యకర్తలకు దూరంగా ఉండటం సరికాదని సదరు కార్యకర్త ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. గులాబీ శ్రేణుల్లో తన ప్రతిష్ట దెబ్బతింటోందని గ్రహించిన మల్లారెడ్డి, ఆ రక్తపు లేఖపై స్పందిస్తూ తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని, ఆ లేఖ రాసిన కార్యకర్తను స్వయంగా కలిసి మాట్లాడతానని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.ఎటు చూసినా మల్లారెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టమైన క్లారిటీ ఇవ్వకుండా సేఫ్ గేమ్ ఆడుతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది.
Also Read:70 ఏళ్ల వృద్ధురాలిపై అఘాయిత్యం, ఇద్దరు నిందితుల అరెస్ట్
ఒకవైపు పార్టీని విడిచిపెడితే వచ్చే నష్టాలను, వ్యాపార సామ్రాజ్యాలపై పడే ప్రభావాన్ని అంచనా వేస్తూనే.. మరోవైపు బీఆర్ఎస్‌లోనే ఉంటూ సొంత గుర్తులకు, జెండాలకు దూరంగా ఉండటం ద్వారా ఆయన పొలిటికల్ సేఫ్ ఎగ్జిట్ కోసం మార్గం సుగమం చేసుకుంటున్నారని భావిస్తున్నారు. ను బీఆర్‌ఎస్ పార్టీని వీడుతున్నట్లు జరుగుతు ప్రచారంలో నిజం లేదన్నారు మల్లారెడ్డి. చివరివరకు బీఆర్‌ఎస్‌లోనే ఉంటానని.. కొంతమంది ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని.. ఎవరూ నమ్మొద్దన్నారు. తాను పార్టీ మారబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని నిజం అనుకుని ఓ అభిమాని రక్తంతో లేఖ పంపడం చూసి బాధపడ్డానని చెప్పుకొచ్చారు. లేఖ రాసిన కార్యకర్త ఎవరో తెలుసుకుని త్వరలోనే స్వయంగా కలిసి మాట్లాడతానన్నారు. కేటీఆర్ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని.. ఆయనకు బర్త్ డే విషెస్ తెలియజేశారు. తెలంగాణకు కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని.. ఆయన్ను సీఎం కుర్చీలో చూడటమే తన లక్ష్యమన్నారు.మల్లారెడ్డి పార్టీ మారతారనే ప్రచారంతో.. ఇటీవల బీఆర్‌ఎస్ కార్యకర్త రక్తంతో పంపిన లేఖ వైరల్ అయ్యింది. మల్లారెడ్డి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారని.. లక్షలాది మంది కార్యకర్తల విశ్వాసాన్ని మల్లారెడ్డి దెబ్బతీస్తున్నారని కార్యకర్త ఆవేదన వ్యక్తంచేశారు.
Also Read:నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం, నిందితుడిపై పోక్సో కేసు
పార్టీ కార్యకర్తల్ని విస్మరించడం సరికాదని.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు యాక్టివ్‌గా ఉన్న మల్లారెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కార్యక్రమాలకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. అధికార పార్టీ కార్యక్రమాల వేదికలపై మల్లారెడ్డి కనిపించడం వల్ల క్షేత్రస్థాయిలో ఉన్న లక్షలాది మంది కార్యకర్తల్లో తప్పుడు సంకేతాలు వెళుతున్నాయన్నారు.మల్లారెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తల్ని తన సంస్థల్లో పనిచేసే ఉద్యోగులుగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలు, కేడర్‌కు అండగా ఉండాల్సింది పోయి దూరంగా ఉండటం పార్టీకి నష్టమన్నారు. పార్టీ సిద్ధాంతాలను, కార్యకర్తలను మరచిపోయిన నేతలు చరిత్రలో కనుమరుగైపోవడం ఖాయమన్నారు. పార్టీపై ప్రేమతో లేఖ రాస్తున్నానని.. ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదన్నారు. ఒక కార్యకర్తగా మనసులో బాధను చెబుతున్నాను అన్నారు. మొత్తానికి మల్లారెడ్డి పార్టీ మార్పు ప్రచారానికి ఎండ్ కార్డ్ వేశారు. తాను బీఆర్ఎస్‌లోనే కొనసాగుతానని మరోసారి తేల్చి చెప్పారు.
