లాహౌల్-స్పితి, క్రైమ్‌మిర్రర్: హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్-స్పితి జిల్లాలో శుక్రవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భారీ వర్షాల కారణంగా ఉదయ్‌పూర్-కిలార్ రహదారిపై ‘కడూ నాలా’ వద్ద భారీ కొండచరియలు విరిగిపడటంతో, మార్గమధ్యంలో వెళ్తున్న ఒక టాటా సుమో ధ్వంసమైంది.ఈ వాహనంలో ప్రయాణిస్తున్న 15 మందిలో ఇద్దరు సురక్షితంగా బయటపడగా, మిగిలిన 13 మంది దుర్మరణం చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ వాహనం కుల్లు నుంచి పంగికి ప్రయాణిస్తోంది.
Also Read:భారీ పేలుడుతో దద్దరిల్లిన పాకిస్థాన్.. 15 మంది భద్రతా సిబ్బంది మృతి
ఎమ్మెల్యే జనక్ రాజ్ ఈ దుర్ఘటనను ధ్రువీకరించారు. ప్రమాదం జరిగిన వెంటనే వాహనంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగాఅంతకుముందు రోజు కొండచరియలు విరిగిపడటంతో అధికారులు ఈ మార్గాన్ని మూసివేశారు. దీంతో ప్రయాణికులతో ఉన్న ఆ వాహనం టిండి గ్రామంలో రాత్రంతా నిలిచిపోయింది. శుక్రవారం ఉదయం అధికారులు మార్గాన్ని పునరుద్ధరించడంతో టాటా సుమో తన ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించింది. ప్రయాణం మొదలైన కొద్దిసేపటికే కొండచరియలు విరిగిపడడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందగా మిగిలిన ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మృతుల వివరాలను సేకరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Also Read:హాస్టల్లో ఉరివేసుకుని బీటెక్ విద్యార్థిని బలవన్మరణం
