తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన వంశీ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
ఈ ఘటనలో అత్యంత సంచలనంగా మారింది సూసైడ్ నోట్. యువకుడు రాసిన ఆ నోట్‌లో తన మరణానికి దేశ ప్రధాని నే కారణమని పేర్కొన్నట్లు సమాచారం. అదే సమయంలో తన మరణానికి ఇతరులను ఎవరినీ నిందించవద్దని కూడా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, సూసైడ్ నోట్ గురించి, యువకుడి వ్యక్తిగత పరిస్థితులు, ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారగా, అసలు కారణాలు వెలుగులోకి రావాల్సి ఉంది. పోలీసుల దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
also read: పేపర్ లీక్‌లపై విద్యార్థుల ఉద్యమానికి సల్మాన్ ఖాన్ మద్దతు.. ఎమోషనల్ పోస్ట్ వైరల్