Homeక్రైమ్రెబ్బెన్ లో రక్తపాతం.. రైల్వే స్టేషన్ సమీపంలో వృద్ధుడు దారుణ హత్య

రెబ్బెన్ లో రక్తపాతం.. రైల్వే స్టేషన్ సమీపంలో వృద్ధుడు దారుణ హత్య

క్రైం మిర్రర్ : కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్ సమీపంలో ఓ వృద్ధుడు హత్యకు గురైన ఘటన శుక్రవారం మధ్యాహ్నం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. మృతుడిని రెబ్బెనకు చెందిన మాసాడే సోమయ్యగా గుర్తించినట్లు తెలుస్తోంది. గుర్తు తెలియని వ్యక్తులు అతడిని హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని రైల్వే స్టేషన్ సమీపంలో పడేసినట్లు అనుమానిస్తున్నారు. నిందితులు వృద్ధుడి తలను, మొండాన్ని వేరు చేసి పడేయడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.  స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న రెబ్బెన పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఎస్సై వెంకటకృష్ణ పోలీసు సిబ్బందితో కలిసి ఆధారాలను సేకరించారు. అనంతరం రెబ్బెన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సంజయ్ కూడా ఘటనాస్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.

హత్యకు గల కారణాలు ఏమిటి? ఈ ఘటన వెనుక ఎవరున్నారు? పాత కక్షలా.. లేక మరేదైనా కారణమా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు అవసరమైన ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యే అవకాశం ఉంది.

also read : వివాహేతర సంబంధం మోజులో దారుణం.. కన్న కొడుకుపై ప్రియుడుతో కలిసి తల్లి దాడి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు