ఏలూరు నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ పాఠశాల బాలికపై లైంగిక దాడి జరిగినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపింది. నగరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న బాలికపై పాఠశాల సమీపంలో కొబ్బరికాయలు విక్రయించే ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడినట్లు బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వెంటనే స్పందించి కేసు నమోదు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న దండూరి చుక్కయ్య (62)ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోక్సో చట్టం కింద దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాలికకు అవసరమైన సహాయం అందిస్తూ, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు వెల్లడించారు.
also read: మొసలి దాడిలో బాలుడి విషాదాంతం.. నదిలోకి లాక్కెళ్లి ప్రాణాలు తీసిన వైనం