క్రైమ్ మిర్రర్,అమరావతి:- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకంపై మరో శుభవార్త ప్రకటించింది. ఈ నెల 22వ తేదీన ఈ పథకం కింద నిధులు విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన ప్రభుత్వం, తాజాగా లబ్ధిదారుల పరిధిని విస్తరిస్తూ నిర్ణయం తీసుకుంది.తాజా అప్డేట్ ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 17 వేల మంది అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు (ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న వారికి) కూడా ఈ స్కీమ్‌ను వర్తింపజేయనున్నారు. దీంతో పాటు శానిటేషన్ వర్కర్ల పిల్లలకు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. అర్హులైన వీరి ఖాతాల్లో రూ. 13 వేల చొప్పున జమ చేయనున్నారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగుల నిబంధనల కారణంగా అంగన్వాడీ, శానిటేషన్ వర్కర్ల పిల్లలకు ఈ పథకం కింద ఆర్థిక సహాయం పొందే అవకాశం ఉండేది కాదు. తాజా నిర్ణయంతో నిరుపేద కుటుంబాలకు చెందిన ఈ పిల్లల చదువుకు అండగా నిలిచినట్లయింది. ఈ నిర్ణయం పట్ల అంగన్వాడీ, శానిటేషన్ వర్కర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గ్యారంటీ లేకుండా రూ. 20 లక్షల వరకు రుణం.. ప్రధానమంత్రి ముద్రా యోజన!
పూరీ జగన్నాథ రథయాత్రలో విషాదం.. తొక్కిసలాటలో భక్తుడి మృతి