Homeక్రైమ్మందుబాబులకు షాక్...!

మందుబాబులకు షాక్…!

  • తెలంగాణలో భారీగా పెరగనున్న మద్యం ధరలు

  • 17న జరిగే సమావేశంలో కమిటీ కీలక నిర్ణయాలు

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో మద్యం బాబులకు షాక్. అక్కడ మద్యం ధరలు పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మద్యం ధరల పెంపుపై ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈనెల 17న ఆ కమిటీ సమావేశం జరగనుంది. మద్యం ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే మద్యం తయారీ సంస్థలు ప్రభుత్వానికి ధరల సవరణ కోసం అనేకసార్లు విజ్ఞప్తి చేశాయి. ఈ క్రమంలోనే ధరల నిర్ణయం కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. మద్యం ధరల పెంపు, కొత్త ధరల అమలు, బాటిల్స్ సైజ్ వంటి అనేక ముఖ్యమైన అంశాలపై చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

ధర పెంచాలంటున్న తయారీదారులు…

Also Read:ప్రియుడితో వివాదం… ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య – అల్లూరి జిల్లాలో విషాదం

మద్యం తయారీ డిస్టలరీలకు మద్యం ఉత్పత్తి ఖర్చులు, పన్నులు, రవాణా వ్యయం బాగా పెరిగిన నేపథ్యంలో తయారీదారులు ధర పెంచాలని పట్టుబడుతున్నారు. ప్రస్తుత ధరలతో విక్రయాలు చేయడం కష్టంగా మారిందని.. అందుకే మద్యం ధరలు పెంచి ఆదుకోవాలని కోరుతున్నారు. అయితే తాజాగా ఏర్పాటు అయిన కమిటీ కేవలం తయారీదారుల అభిప్రాయాలే కాకుండా.. అన్ని వర్గాల అభిప్రాయాలను క్రోడీకరించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఒకేసారి భారీగా ధరలు పెంచడం కంటే.. క్రమేపి ధరలు పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

10 నుంచి 20 శాతం పెరుగుదల…

Also Read:ఘనంగా పూరీ జగన్నాథ రథయాత్ర ప్రారంభం.. లక్షలాది భక్తుల సందడి

అయితే ఈ కమిటీకి వచ్చిన నివేదికల ప్రకారం ప్రస్తుత ధరలపై పది నుంచి 20 శాతం పెంచే ఆలోచనతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. కేవలం మద్యం ధరలే కాదు సీసాల సైజు విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకోనున్నారు. కొత్తగా 150 ml సైజు బాటిల్స్ ప్రవేశపెట్టాలని తయారీ సంస్థల సూచనలు కూడా పరిగణలోకి తీసుకోనున్నారు. మార్కెట్లో కొత్తగా వీటిని తీసుకురావడం, వినియోగదారులకు మరిన్ని ఎంపికలు చేసుకునే అవకాశం కల్పించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈనెల 17న జరగనున్న ఈ కమిటీ సమావేశంలో పూర్తిస్థాయిలో చర్చించి.. వినియోగదారులపై భారీగా భారం మోపకుండా తగిన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కానీ మద్యం ధర పెరుగుదల అనేది అనివార్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగా ఏర్పాటు అయిన కమిటీ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం ఆదాయం పెంచుకునేలా.. ఉత్పత్తి కంపెనీల సమస్యలు పరిష్కరించేలా.. మద్యం వినియోగదారులకు ఎక్కువ భారం కాకుండా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు