-
కట్టడి చేయలేకపోతున్న గాంధీభవన్ వర్గాలు
-
క్రమేపి తగ్గుతున్న హస్తం జోష్
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో అధికార కాంగ్రెస్ లో సమన్వయ లోపం రోజురోజుకు పెరుగుతోంది. గత కొంతకాలంగా పార్టీలో అంతర్గతంగా సాగుతున్న పరిణామాలు ఆ పార్టీని అస్తవ్యస్త పరిస్థితిలోకి నెట్టేస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో కనిపించిన జోష్ క్రమేపి తగ్గుతుంది. గాంధీభవన్ వేదికగా నిత్యం అంతర్గత విభేదాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీలో ఆధిపత్య పోరాటం ఢిల్లీలోని కాంగ్రెస్ హై కమాండ్ కు సరికొత్త తలనొప్పులు తెచ్చి పెడుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి పెట్టారు. కానీ పార్టీ వ్యవహారాలను, విభిన్న వర్గాలను ఒక తాటిపైకి తెచ్చే బలమైన సమన్వయకర్త లేకపోవడం ఆ పార్టీలో సంక్షోభం ముదురుతోంది.
చేతులెత్తేసిన మీనాక్షి నటరాజన్…
Also Read:హత్య కేసులో తప్పించుకున్న రౌడీషీటర్ అరెస్ట్.. పీర్ బాబా వేషంలో దాగిన నిందితుడు పట్టివేత
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్చార్జిగా మీనాక్షి నటరాజన్ ఉన్నారు. ఆమె అప్పటికప్పుడు సమన్వయం చేస్తున్నారు కానీ ఫలితం లేకపోతోంది. ఇక్కడి గ్రూపు రాజకీయాలను సర్ది చెప్పలేక చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ లో ప్రధానంగా సీనియర్లకు, జూనియర్లకు మధ్య అగాధం ఏర్పడుతోంది. దానిని పూడ్చడం ఆమె సాధ్యం కావడం లేదు. ఇదే సమయంలో నేతలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. అయితే తెలంగాణ పంచాయతీలో చివరకు మీనాక్షి నటరాజన్ రాజ్యసభ పదవి కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు ఆమె నియంత్రణ దాటి వెళ్లిపోయిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
నోటికి పని చెబుతున్న నేతలు…
Also Read:హైదరాబాద్ చరిత్రలో ఓ అధ్యాయం ముగింపు.. కూలుతున్న తాజ్ బంజారా, రానున్న భారీ ప్రాజెక్ట్
కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు ఇప్పుడు బయటకు వస్తున్నారు. నోటికి పని చెబుతున్నారు. రేణుకా చౌదరి లాంటి ఫైర్ బ్రాండ్ నేతలు బహిరంగంగా చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి చేటు తెస్తున్నాయి. తమ సొంత వర్గ ప్రాధాన్యతల కోసం పట్టుబడుతున్న తీరు పార్టీ క్యాడర్ను గందరగోళంలోకి నడుస్తుంది. ఒకవైపు ప్రభుత్వం నిర్ణయాలను సమర్థిస్తూనే.. మరోవైపు పార్టీలో తనకు దక్కాల్సిన ప్రాధాన్యతపై సీనియర్లు బహిరంగంగానే అసంతృప్తి వెళ్ళగక్కుతున్నారు. ఈ అంతర్గత వర్గ పోరాటం భారత రాష్ట్ర సమితి తో పాటు భారతీయ జనతా పార్టీకి ఆయుధాలుగా మారుతున్నాయి. గాంధీభవన్లో క్రమశిక్షణ అనేది క్రమేపి తగ్గుతుండడం నేతల ఇష్టా రాజ్యానికి కారణం అవుతోంది. ఇటీవల తుంగతుర్తి ఘటన కాంగ్రెస్ పార్టీలో మారిన పరిస్థితికి అర్థం పడుతోంది.
నిమిత్త మాత్రుడిగా సారధి…
Also Read:గోల్కొండ బోనాల జాతర షురూ.. అమ్మవారికి తొలి బోనం ఎత్తిన మంత్రి కొండా సురేఖ
తెలంగాణలో కాంగ్రెస్ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అనుకున్న స్థాయిలో పనిచేయడం లేదు. ఆయన కేవలం నిమిత్తమాత్రుడిగా మిగిలిపోతున్నారన్న టాక్ ఉంది. దీంతో పార్టీలో సీనియర్లు, అసంతృప్తివాదులు రెచ్చిపోతున్నారు. మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడిగా అందరినీ కలుపు కెల్లడం లేదన్న విమర్శ ఉంది. ఏదైనా వివాదం తలెత్తితే దానిని గుర్తించి పరిష్కరించడం లేదు. దీంతో అది రోజు రోజుకు పెద్దదై పార్టీని చికాకులో పెడుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో చర్యలు లేకపోవడంతో నేతలు నోటికి పని చెబుతున్నారు. ముఖ్యంగా వివాదాస్పద నేతలు పార్టీని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇబ్బందుల్లో పడినట్టే.