Homeఆంధ్ర ప్రదేశ్కాకినాడ గొల్లప్రోలులో మాజీ కౌన్సిలర్ భర్త హత్య.. కత్తితో దాడి, ఆస్పత్రిలో మృతి

కాకినాడ గొల్లప్రోలులో మాజీ కౌన్సిలర్ భర్త హత్య.. కత్తితో దాడి, ఆస్పత్రిలో మృతి

కాకినాడ జిల్లా గొల్లప్రోలులో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. మాజీ కౌన్సిలర్ సంధ్య భర్త అర్జున్ దారుణ హత్యకు గురయ్యారు. స్థానికంగా నివాసం ఉండే బచ్చల కళ్యాణ్ లింగం అనే వ్యక్తి అర్జున్‌పై కత్తితో దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో అర్జున్ తీవ్రంగా గాయపడగా, వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందారు.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికానున్నాయి.

also read: దేవుడికి హారతి ఇస్తుండగానే గుండెపోటు… ఆలయంలోనే కుప్పకూలిన ప్రధాన అర్చకుడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు