బెంగాల్, క్రైమ్‌మిర్రర్: పశ్చిమ బెంగాల్‌లోని మేదినీపూర్ జిల్లాలో పసిమొగ్గపై జరిగిన లైంగిక దాడి ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది. ఒకటో తరగతి చదువుతున్న ఆరేళ్ల అమాయక చిన్నారిపై పాఠశాల ఆవరణలోనే బాయ్స్ టాయిలెట్ అటెండెంట్ దారుణానికి ఒడిగట్టాడు. ఈ దారుణాన్ని కప్పిపుచ్చేందుకు స్వయంగా స్కూల్ ప్రిన్సిపాల్, తోటి ఉపాధ్యాయులు ప్రయత్నించడంపై స్థానికంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.!పశ్చిమ బెంగాల్‌లోని మేదినీపూర్ జిల్లాలో పసిమొగ్గపై జరిగిన లైంగిక దాడి ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది. ఒకటో తరగతి చదువుతున్న ఆరేళ్ల అమాయక చిన్నారిపై పాఠశాల ఆవరణలోనే బాయ్స్ టాయిలెట్ అటెండెంట్ దారుణానికి ఒడిగట్టాడు. ఈ దారుణాన్ని కప్పిపుచ్చేందుకు స్వయంగా స్కూల్ ప్రిన్సిపాల్, తోటి ఉపాధ్యాయులు ప్రయత్నించడంపై స్థానికంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఆరేళ్ల చిన్నారి ఎప్పటిలాగే పాఠశాలకు వెళ్ళింది. స్కూల్ ముగిసిన తర్వాత తల్లి ఆమెను ఇంటికి తీసుకురావడానికి వెళ్లినప్పుడు, ఆ చిన్నారి తీవ్ర భయాందోళనలతో కలత చెంది కనిపించింది.
Also Read:2027 మార్చి నాటికి పోలవరం పూర్తి.. జాతికి అంకితం చేస్తామన్న సీఎం చంద్రబాబు!
ఇంటికి వచ్చిన తర్వాత భయపడుతూనే పాఠశాలలో జరిగిన ఘోరాన్ని తల్లిదండ్రులకు వివరించింది. తాను టాయిలెట్‌కు వెళ్లిన సమయంలో బాయ్స్ టాయిలెట్ అటెండెంట్ తలుపు లోపల గడియ పెట్టి, బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డాడని చెప్పింది. ఆ సమయంలో నిందితుడి స్నేహితుడు వచ్చి బయటి నుండి తలుపు తట్టడంతో నిందితుడు చిన్నారిని వదిలేశాడు. లేకపోతే ఊపిరాడక స్పృహ కోల్పోయే స్థితికి ఆ చిన్నారి చేరుకుండేదని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.ఈ దారుణంపై చిన్నారి తల్లిదండ్రులు వెంటనే పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు. అయితే, బాధితులకు న్యాయం చేయాల్సిన ప్రిన్సిపాల్.. నిందితుడిని సమర్థించే ప్రయత్నం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే పాఠశాల పరువు పోతుందని బెదిరిస్తూ, వారిని కూడా ఫిర్యాదు చేయకుండా అడ్డుకున్నారు. పాఠశాల యాజమాన్యం తీసుకున్న ఈ నిర్లక్ష్యపూరిత చర్యపై ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున నిరసనకు దిగారు.
Also Read:‘లెనిన్’ మూవీపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు.. భావోద్వేగానికి లోనైన అఖిల్ అక్కినేని!
స్కూల్ ఎదుట ఆందోళన తీవ్రం కావడంతో చివరికి పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది.బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, తక్షణమే అతడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ పాపియా సుల్తానా స్పందిస్తూ.. బాధితురాలి వయసు, సున్నితత్వాన్ని పరిగణనలోకి తీసుకుని మరిన్ని వివరాలను గోప్యంగా ఉంచుతున్నామని, తక్షణమే కఠిన చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. మరోవైపు, నిందితుడిని కాపాడటానికి ప్రయత్నించిన ప్రిన్సిపాల్‌ను వెంటనే విధుల నుండి తొలగించాలని, బాధితులను హేళన చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన తోటి ఉపాధ్యాయులను కూడా సస్పెండ్ చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనతో విద్యార్థుల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.