Homeక్రీడలులార్డ్స్ వేదికగా మన మహిళల జట్టు సంచలనం: ఇంగ్లాండ్‌పై 270 పరుగుల తేడాతో చారిత్రక విజయం!

లార్డ్స్ వేదికగా మన మహిళల జట్టు సంచలనం: ఇంగ్లాండ్‌పై 270 పరుగుల తేడాతో చారిత్రక విజయం!

క్రైమ్ మిర్రర్,స్పోర్ట్స్:- క్రికెట్ మక్కాగా పిలవబడే లార్డ్స్ మైదానంలో భారత మహిళల క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో టీమిండియా 270 పరుగుల భారీ తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. లార్డ్స్ క్రికెట్ స్టేడియం చరిత్రలో ఇదే మొట్టమొదటి మహిళల టెస్టు మ్యాచ్ కావడం, అందులోనూ భారత్ విజయం సాధించడం విశేషం. భారత్ నిర్దేశించిన 457 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు.. భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేక కేవలం 186 పరుగులకే ఆలౌట్ అయింది. మ్యాచ్ 4వ రోజైన నేడు 130/6 ఓవర్‌నైట్ స్కోరుతో ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు.. మరో 56 పరుగులు మాత్రమే జోడించి మిగిలిన 4 వికెట్లను కోల్పోయింది. భారత బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేసి ఇంగ్లాండ్‌కు ఎలాంటి భాగస్వామ్యాలు నెలకొల్పే అవకాశం ఇవ్వలేదు.

ప్రేమ వివాహానికి అడ్డుగా నిలిచిందని అత్తని గొడ్డలితో చంపిన అల్లుడు.. కూతురు కళ్లముందే దారుణ హత్య

యస్తికా సెంచరీ.. క్రాంతి బౌలింగ్ విద్వంసం
భారత జట్టు విజయంలో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆటగాళ్లు అద్భుత ప్రతిభ కనబరిచారు.బ్యాటింగ్‌లో యస్తికా మెరుపులు: భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ యస్తికా భాటియా అద్భుతమైన సెంచరీతో జట్టుకు కొండంత స్కోరును అందించింది.క్రాంతి బౌలింగ్ ప్రదర్శన: బౌలింగ్ విభాగంలో క్రాంతి అద్భుత స్పెల్‌తో ఇంగ్లాండ్ బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టారు. ఈ మ్యాచ్‌లో క్రాంతి మొత్తం 7 వికెట్లు పడగొట్టి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు.
స్కోరు వివరాలు:భారత్ (IND) మొదటి ఇన్నింగ్స్: 285భారత్ (IND) రెండో ఇన్నింగ్స్: 341/7ఇంగ్లాండ్ (ENG) మొదటి ఇన్నింగ్స్: 170ఇంగ్లాండ్ (ENG) రెండో ఇన్నింగ్స్: 186లార్డ్స్ వేదికగా జరిగిన ఈ చారిత్రాత్మక టెస్టులో ఘన విజయం సాధించిన భారత మహిళల జట్టుపై ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా క్రీడా ప్రముఖులు మరియు అభిమానుల నుండి ప్రశంసల వర్షం కురుస్తోంది.

నాన్న పడిన కష్టాలే నన్ను ఈ స్థాయికి చేర్చాయి: హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే భావోద్వేగం

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు