Homeతెలంగాణమనవడి కోరిక మేర‌కు పూరీలు వేసిన సీఎం రేవంత్‌...! సోష‌ల్ మీడియాలో వైరల్‌...

మనవడి కోరిక మేర‌కు పూరీలు వేసిన సీఎం రేవంత్‌…! సోష‌ల్ మీడియాలో వైరల్‌…

హైద‌రాబాద్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి చాలా సింపుల్‌గా ఉంటారు. ఆహార్యంతోపాటు ఆయన వ్యవహారశైలి కూడా ఎంతో మందిని ఆకట్టుకుంటుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన మరింత సింపుల్‌గా ఉండడాన్ని అలవాటు చేసుకున్నారు. రాజకీయాల్లో, పాలనీలో నిత్యం బిజీగా ఉండే సీఎం రేవంత్‌ రెడ్డి.. కుటుంబానికి కూడా తగిన సమయాన్ని కేటాయిస్తుంటారు. వీలుచిక్కునప్పుడల్లా కుటుంబంతో గడిపేందుకు ఆయన ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతూ ఉత్సాహంగా కనిపిస్తుంటారు. సీఎం రేవంత్‌ రెడ్డికి తన మనవడు రేయాన్స్‌ అంటే ఎంతో ఇష్టం. ఎప్పటికప్పుడు మనవడితో ఫొటోలు దిగుతూ కనిపిస్తుంటారు. తాజాగా మనవడు ఇష్టమైన వంటనే ఆయనే స్వయంగా చేయడం గమనార్హం. మనవడు రేయాన్స్‌ పూరీలు తింటానని చెప్పాడు. అది కూడా తాత స్వయంగా వేయాలని కోరడంతో సీఎం రేవంత్‌ రెడ్డి పూరీలు వేసేందుకు సిద్ధమయ్యారు.

Also Read:రైలు క్యాబిన్‌ను హనీమూన్ సూట్‌గా మార్చిన జంట.. వీడియో వైరల్ – TTE సస్పెండ్!

స్వయంగా పూరీలు చేసి నూనెలో వేయించారు. మనవడు పక్కన ఉండగా.. ఆయన సరదాగా మాట్లాడుతూ దగ్గరుండి పూరీలు వండి పెట్టారు. ఈ క్రమంలోనే మనవడితో చిట్‌ చాట్‌ కూడా చాలా సరదాగా సాగింది. ఈ పూరీలు చాలా అని సీఎం రేవంత్‌ రెడ్డి మనవడిని అడగ్గా.. అమ్మమ్మకు కూడా కావాలంటూ అడిగాడు. నీకు చేసిన కదా అని సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పగా.. అమ్మకు, నాన్నకు వద్దా అని చిన్నారి పేర్కొన్నారు. ఓవల్‌గా ఉందని చెప్పగా.. అయితే రౌండ్‌గా చేస్తానని సీఎం పేర్కొన్నారు. చిన్నారిని దగ్గర కూర్చోబెట్టి పూరీ చేయడంతోపాటు.. చిన్నారి కోరిక మేరకు వండడం గమనార్హం. నేను తింటా అంటూ చిన్నారి అడగ్గా.. ఇంకా రెండు, మూడు చేయాలి అంటూ సీఎం రేవంత్‌ పేర్కొన్నారు. ఈ వీడియోను స్వయంగా ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. మనవడితో పూరీలు వేస్తూ గడిపిన క్షణాలు అంటూ రాసుకొచ్చారు. ఈ వీడియో కొన్ని క్షణాల్లో వేలాది వ్యూస్‌ను దక్కించుకోవడంతోపాటు మంచి తాత, మంచి సీఎం అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Also Read:Historic Defeat: సాల్ట్-బ్రూక్ దెబ్బకు టీమిండియా చిత్తు.. భారత్‌పై తొలి టీ20 సిరీస్ దక్కించుకున్నఇంగ్లండ్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు