విశాఖపట్నం, క్రైమ్‌మిర్రర్: విశాఖలో గురువారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లారీ నుంచి భారీగా మంటలు ఎగసిపడడంతో ఒక్కసారిగా ప్రజలు ఆందోళన చెందారు. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. అచ్యుతాపురం మండలం మార్టూరు రహదారిపై గురువారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా అటుగా వెళుతున్న ఒక లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు ఒక్కసారిగా ఎగిసిపడడంతో వాహనం పూర్తిగా అగ్నికి ఆహుతైంది. తెల్లవారుజామున సుమారు 4:40 గంటల సమయంలో ‘AP 31 TF 6381’ నంబరు గల లారీ మార్టూరు రోడ్డు గుండా వెళ్తోంది. ఈ క్రమంలో ఒక్కసారిగా క్యాబిన్ భాగం నుంచి పొగలు, మంటలు వ్యాపించాయి. దీన్ని గమనించిన డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి, వెంటనే లారీని పక్కకు నిలిపివేసి కిందకు దూకేశాడు.
Also Read:Awiqli Insulin: ఇక రోజూ కాదు.. వారానికో ఇంజెక్షన్ చాలు.. షుగర్ బాధితులకు గుడ్ న్యూస్!
క్షణాల వ్యవధిలోనే మంటలు లారీ మొత్తానికి వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే లారీ పూర్తిగా అస్థిపంజరంగా మారింది. డ్రైవర్ అప్రమత్తమవ్వడంతో పెద్ద ప్రమాదం తప్పిందని, ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారని స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ క్షేమంగా బయటపడటంతో అతడిని వివరాలు అడిగి పోలీసులు తెలుసుకుంటున్నారు. లారీలో ఉన్న సరుకు, ఇతర వివరాలను తెలుసుకునే పనులు పోలీసులు నిమగ్నమయ్యారు. లక్షల రూపాయల మెటీరియల్ కాలి బూడిద అయినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:నటుడిగా మెహర్ రమేష్ రీఎంట్రీ?
ఒక్కసారిగా లారీ నుంచి భారీ ఎత్తున మంటలు ఎగసిపడడంతో స్థానికులు ఆందోళన చెందారు. మంటలు ఎగసిపడిన వాహనం వద్దకు చుట్టుపక్కలకు చెందిన పలువురు చేరుకొని వాటిని ఆపే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. క్షణాలు వ్యవధిలోనే మంటలు ఒక్కసారిగా ఎగిసిపడడంతో మంటలను అదుపు చేయలేని పరిస్థితి ఏర్పడినట్లు స్థానికులు వెల్లడించారు. డ్రైవర్ కూడా పరిస్థితిని సకాలంలో గుర్తించి బయటకు దూకేయడం వలన ప్రాణాలతో బయటపడ్డాడని స్థానికులు చెబుతున్నారు. బాంబు పడితే ఎలా మంటలు ఎగిసి పడతాయో ఆ విధంగా మంటలు ఒక్కసారిగా చెలరేగిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఈ ఘటనతో అక్కడ బయోత్పత వాతావరణం నెలకొంది.