అమరావతి, క్రైమ్‌మిర్రర్:ఏపీలో మరోసారి కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. గత కొన్నాళ్లుగా కరోనా వైరస్ కనుమరుగయింది. అయితే అనూహ్యంగా రాష్ట్రంలో మరోసారి కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కడప జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు కరోనా వైరస్ బారిన పడి మంగళవారం మృతి చెందారు. ఈ వ్యవహారం ఇప్పుడు ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. మృతిచెందిన ఇద్దరికీ ఆర్టిపిసిఆర్ పరీక్షలో కరోనా వైరస్ పాజిటివ్గా తేలడంతో అప్రమత్తమైన అధికారులు తదుపరి నిర్ధారణ పరీక్ష కోసం వారి నమూనాలను మహారాష్ట్రలోని పూనే వైరాలజీ ల్యాబ్ కు పంపించారు.
Also Read:Kriti Sanon: కృతి సంచలన నిర్ణయం.. పెళ్లికి ముందే షాకింగ్ స్టెప్!
ప్రస్తుతానికి కరోనా వైరస్ వల్ల చనిపోయినట్లు భావిస్తున్న వారిలో 43 ఏళ్ల వయసు కాగా, మరొకరికి 60 ఏళ్లు పైనే ఉన్నాయని చెబుతున్నారు. 43 ఏళ్ల వ్యక్తి కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా, 60 ఏళ్ల పైబడిన వ్యక్తి తమిళనాడు రాష్ట్రంలోని సీఎంసి వెల్లూరులో చికిత్స పొందుతూ మరణించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా కరోనా వైరస్ బారిన పడి ఇద్దరు మృతి చెందడం పట్ల స్థానికంగా భయాందోళన వ్యక్తం అవుతోంది. అసలు కరోనా కేసులు నమోదు కావడానికి గల కారణాలను అధికారులు పరిశీలిస్తున్నారు. కొన్నాళ్లుగా కరోనా వైరస్ కేసులో నమోదు కావడంలేదని, ఈ నేపథ్యంలో ఇద్దరు కరోనా వైరస్తో మృతి చెందడం ఆందోళన కలిగించే అంశంగా నిపుణులు చెబుతున్నారు.
అప్రమత్తమైన ఆరోగ్య శాఖ.. విస్తృతంగా పరీక్షలు…
Also Read:మన ఓట్లను కాపాడుకోవాలి.. పార్టీ శ్రేణులకు సజ్జల పిలుపు!
కరోనా వైరస్ బారిన పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమయింది. కడప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లూరు సీఎంసీతో సంప్రదించి అక్కడ మృతి చెందిన వ్యక్తి నమూనాలు సేకరించే పనిలో పడ్డారు. అదే సమయంలో అనుమానాస్పద కేసులకు కరోనా పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులకు తప్పనిసరిగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయాల్సిందిగా ఆరోగ్యశాఖ అధికారులు వైద్య సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా పరీక్ష నిర్వహించేందుకు అవసరమైన పరీక్షా కిట్లు అందించాలని ఉన్నతాధికారులు ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
Also Read:నటుడిగా మెహర్ రమేష్ రీఎంట్రీ?
రెండు కరోనా మరణాల తరువాత పరీక్షలను మరింత వేగవంతం చేయడంపై అధికారులు దృష్టి సారించారు. జ్వరాల సర్వే కూడా నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈ సర్వేలో జ్వర లక్షణాలు కరోనా తరహాలో ఉన్నవారికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు కూడా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. మృతి చెందిన ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన పూర్తిస్థాయి నివేదిక వచ్చిన రువాత వారి కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే వారి కుటుంబ సభ్యులకు ప్రాథమికంగా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు చెబుతున్నారు.