హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్: తెలంగాణ ప్రభుత్వం పాత జీహెచ్ఎంసీ చట్టం–1955 స్థానంలో కోర్ అర్బర్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నరెన్స్) బిల్లు–2026 (CURE Bill) ముసాయిదాను విడుదల చేసింది. వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగర అవసరాలకు అనుగుణంగా ఆధునిక పాలనా వ్యవస్థను తీసుకురావడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ఈ ముసాయిదాపై ప్రజలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, పరిశ్రమల సంస్థలు, నిపుణులు తమ అభిప్రాయాలు, సూచనలను జూలై 24 వరకు ప్రభుత్వానికి పంపవచ్చు.
Also Read:జనసేనలోకి వంగవీటి రంగా కుమార్తె!
బిల్లు ఎందుకు తీసుకొస్తున్నారు…?
1955లో రూపొందించిన GHMC చట్టం అప్పటి హైదరాబాద్ నగర అవసరాలకు అనుగుణంగా ఉండేది. అయితే ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో ప్రాంత జనాభా దాదాపు 1.3 కోట్లకు చేరుకోవడంతో, నగర విస్తరణ, మౌలిక సదుపాయాలు, సేవల నిర్వహణలో కొత్త సవాళ్లు ఏర్పడ్డాయని ప్రభుత్వం పేర్కొంది. అందుకే ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా సమగ్ర చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించింది.
Also Read:కెసిఆర్ ఫామ్ హౌస్ ‘1000 ఎకరాలు’!
కొత్త బిల్లులోని అంశాలు…
హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్‌కు ఏకీకృత పాలనా వ్యవస్థ ఏర్పాటు, పలు మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నప్పటికీ వాటి మధ్య సమన్వయాన్ని పెంచే విధానం, భవనాల్లో ఎలక్ట్రిక్ వాహనాల (EV) ఛార్జింగ్ సదుపాయాలు తప్పనిసరి చేసే ప్రతిపాదన. గ్రే వాటర్ శుద్ధి, పునర్వినియోగంపై ప్రత్యేక నిబంధనలు, Climate Action Cell ఏర్పాటు చేసి వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించే చర్యలు, Green Energy and Carbon Transition Fund ఏర్పాటు. వారసత్వ కట్టడాల సంరక్షణ, కార్మిక సంక్షేమానికి ప్రత్యేక విభాగాలు. మహిళలు, ట్రాన్స్‌జెండర్‌ల భద్రతకు ప్రాధాన్యం , కాగా ఈ బిల్లులో జెండర్ ఇన్‌క్లూసివ్ సెల్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
Also Read:హైదరాబాద్:బిర్యానీ.. ఓ ఎమోషన్!
మహిళలు, ట్రాన్స్‌జెండర్‌లకు సురక్షితమైన నగర వాతావరణం కల్పించడం. వీధుల్లో మెరుగైన లైటింగ్, సీసీ కెమెరాల విస్తరణ, మహిళలు, ట్రాన్స్‌జెండర్‌లకు అనుకూల మౌలిక సదుపాయాలు, ప్రజా మరుగుదొడ్ల ఏర్పాటు, లింగ సమానత్వంపై ప్రత్యేక ఆడిట్‌లు నిర్వహించే విధానం ప్రతిపాదించారు. ప్రజల అభిప్రాయాలకు అవకాశం ముసాయిదా బిల్లుపై ప్రజల నుంచి సూచనలు, అభ్యంతరాలను ప్రభుత్వం ఆహ్వానించింది. వాటిని పరిశీలించిన అనంతరం తుది రూపం ఇచ్చి శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది