•త్వరలో పవన్ తో భేటీ
•రంగా-రాధా మిత్రమండలి ద్వారా కార్యక్రమాలు
•పొలిటికల్ ఎంట్రీ కి సిద్ధం
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో:-ఏపీలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకోనుంది. త్వరలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో వంగవీటి మోహన్ రంగా కుమార్తె ఆశా కిరణ్ భేటీ కానున్నారు. ఇప్పటికే రంగా రాధా మిత్రమండలి ద్వారా యాక్టివ్ అయ్యారు ఆశా కిరణ్. త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇస్తారన్న ప్రచారం ఉంది. సరిగ్గా ఇదే సమయంలో ఆమె పవన్ కళ్యాణ్ తో భేటీ అవుతారన్న ప్రచారం పొలిటికల్ వర్గాలను హీట్ ఎక్కిస్తోంది. ఇటీవల వంగవీటి మోహన్ రంగా జయంతి సందర్భంగా జనసేన అధినేత హోదాలో నివాళులు అర్పిస్తూ ప్రత్యేక ప్రకటన జారీ చేశారు పవన్ కళ్యాణ్. దీంతో వంగవీటి ఆశ కిరణ్ స్పందించి పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకు పవన్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలో వీరి భేటీ కానున్నట్లు సమాచారం.
రాష్ట్ర నాయకుడిగా ఎదిగి..
1988లో దారుణ హత్యకు గురయ్యారు వంగవీటి మోహన్ రంగ. విజయవాడ కేంద్రంగా అణగారిన వర్గాల కోసం ఆయన అలుపెరగని పోరాటం చేశారు. తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు. అనతి కాలంలోనే ఒక రాష్ట్ర నాయకుడిగా ఎదుగుతున్న క్రమంలో దారుణ హత్యకు గురయ్యారు. కాపు సామాజిక వర్గం తమ ఆరాధ్య నాయకుడిగా భావించింది. తమ రాజకీయ ఆకాంక్ష వంగవీటి మోహన్రంగా నెరవేర్చుతారని భావించింది. ఆయన హత్యకు గురికావడంతో కాపులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే ఇన్నాళ్లకు పవన్ కళ్యాణ్ రూపంలో కాపుల ఆకాంక్ష నెరవేరేంది. అందుకే వంగవీటి మోహన్ రంగ ఆశయాలను పవన్ కళ్యాణ్ ద్వారా తీర్చుకోవాలని కాపులు చూస్తున్నారు. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు.
కొద్ది నెలల నుంచి కార్యక్రమాలు..
కొద్ది నెలల కిందట రంగారాధ మిత్రమండలిని క్రియాశీలకం చేసేందుకు రంగంలోకి దిగారు వంగవీటి ఆషాకిరణ్. ఇటీవల రంగ జయంతి వేళ ఆశాకిరణ్ నివాళులు అర్పించారు. తన తండ్రి ఆశయాల సాధన కోసం పని చేస్తామని చెప్పారు. వంగవీటి రంగా పేరును జిల్లాకు పెట్టాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. తన తండ్రి అంత్యక్రియలు జరిగిన కృష్ణా నది తీరంలో.. రంగా స్మారక ఘాట్ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. వీటిపై త్వరలోనే ఏపీ డిప్యూటీ సీఎం కలుస్తానని.. పవన్ కళ్యాణ్ తప్పకుండా పరిష్కార మార్గం చూపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే వీరి భేటీ జరగనుంది. ఆశ కిరణ్ జనసేనలో చేరుతారని గతంలో ప్రచారం నడిచింది. ఇప్పుడు తన తండ్రి కోసం పవన్ కళ్యాణ్ ను ఆమె కలుస్తుండడంతో.. ఆమె జనసేనలో చేరికకు సంబంధించిన అనుమానాలు నిజమయ్యేలా ఉన్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.