Homeతెలంగాణకెసిఆర్ ఫామ్ హౌస్ '1000 ఎకరాలు'!

కెసిఆర్ ఫామ్ హౌస్ ‘1000 ఎకరాలు’!

•సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు
•రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు దీనిపైనే చర్చ
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో
:-తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. నాగర్ కర్నూల్ జిల్లా మిడ్జిల్ లో కృతజ్ఞతా సభ జరిగింది. రేవంత్ రాజకీయాల్లోకి వచ్చి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కృతజ్ఞతా సభ ఏర్పాటు చేశారు. రేవంత్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా కెసిఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎర్రవెల్లిలో వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ లో కెసిఆర్ ఉన్నారంటూ ఆరోపించారు. ఈ కామెంట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఫామ్ హౌస్ లోపల కారు వేసుకుని పావుగంట డ్రైవ్ చేసినా.. దాని సరిహద్దు గోడ దాటలేరు అంటూ అనేక రకాల ప్రచారాలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే రాజకీయంగా విమర్శలు ఎలా ఉన్నప్పటికీ.. చట్టబద్ధంగా, రికార్డుల ప్రకారం కెసిఆర్ ఫామ్ హౌస్ వైశాల్యం ఎంత? ఆయన ఎన్నికల అఫిడవిట్ లో ఏం పేర్కొన్నారు? అనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఏకంగా సీఎం రేవంత్ 1000 ఎకరాల విస్తీర్ణంలో ఫామ్ హౌస్ ఉంటుందని చేసిన ప్రకటన పొలిటికల్ వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది.

ఎన్నికల ఆఫిడవిట్ లో..
కెసిఆర్ ప్రజాక్షేత్రంలో ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్నారు. ఎన్నికల అఫీడవిట్ లో తప్పకుండా తన ఆస్తుల వివరాలను వెల్లడించాలి. కానీ కెసిఆర్ పేరుతో కానీ.. ఆయన సతీమణి శోభా పేరుతో కానీ.. వ్యక్తిగతంగా ఎలాంటి వ్యవసాయ భూములు లేవని పేర్కొన్నారు. అయితే హిందూ అవిభక్త కుటుంబం పేరుతో సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలం ఎర్రవెల్లి గ్రామంలో ఉమ్మడి కుటుంబ ఆస్తిగా.. వ్యవసాయ భూములు ఉన్నట్లు రికార్డుల్లో చూపించారు. ఈ అఫిడవిట్ ప్రకారం కెసిఆర్ కుటుంబానికి ఎర్రవెల్లి పరిధిలో సుమారు 53.30 ఎకరాల సాగు భూమి.. మరో 9.36 ఎకరాల వ్యవసాయేతర భూమి కలిపి.. మొత్తంగా దాదాపు 62.66 ఎకరాల భూమి చట్టబద్ధంగా రిజిస్ట్రాయి ఉంది. దీని విలువ మార్కెట్ ప్రకారం 15 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని తన అఫిడవిట్ లో పేర్కొన్నారు.

అప్పట్లో అలా ప్రచారం..
కెసిఆర్ ఫామ్ హౌస్ అనేది నిత్యం చర్చల్లోకి వచ్చేదే. 2017లో కేసీఆర్ ఎక్కడ ఆయుధ చండీయాగం చేపట్టారు. ఆ సమయంలో ఫామ్ హౌస్ విస్తీర్ణం 120 ఎకరాల వరకు ఉంటుందన్న ప్రచారం జరిగింది. 2021-22 సమయంలో కెసిఆర్ స్వయంగా తాను 150 ఎకరాల్లో వరి, అల్లం పంటలు పండిస్తున్నట్లు ప్రకటించడం హాట్ టాపిక్ అయింది. కెసిఆర్ ఫామ్ హౌస్ చుట్టుపక్కల ఉన్న వందలాది ఎకరాల భూములు కూడా పరోక్షంగా వారి నియంత్రణలోనే ఉన్నాయనేది కాంగ్రెస్ నాయకుల ప్రధాన ఆరోపణ. అందులో అసైన్డ్ భూములు, ఇనాం భూములను గత పదేళ్ల కాలంలో.. గులాబీ పార్టీ నేతలు, కెసిఆర్ బంధువులు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కేవలం కేసీఆర్ ఫామ్ హౌస్ నిర్వహణ కోసమే.. ఆ చుట్టుపక్కల భారీగా సెక్యూరిటీ జోన్లను, క్లోజ్డ్ కాంపౌండ్ వాల్స్ ను ఏర్పాటు చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తుంటారు. అయితే రికార్డుల ప్రకారం ఉన్న 62 ఎకరాల కంటే ఎక్కువగానే అక్కడ ఉన్నట్లు స్థానికులు సైతం చెబుతుంటారు. అయితే ఎక్కువ భూమి ఉంటే తప్పేంటి అని గులాబీ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కెసిఆర్ కు వ్యవసాయం అంటే ఇష్టమని.. భూమి కొనుగోలు చేసి సాగు చేస్తే వచ్చిన నొప్పి ఏంటని ప్రశ్నించిన వారు ఉన్నారు. ఏది ఏమైనా కెసిఆర్ ఫామ్ హౌస్ చుట్టూ ఇప్పుడు రాష్ట్రంలో చర్చ జరుగుతుండడం విశేషం.

మూడు లక్షల కొత్త పింఛన్లు!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు