Homeతెలంగాణమూడు లక్షల కొత్త పింఛన్లు!

మూడు లక్షల కొత్త పింఛన్లు!

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం
•అనర్హులను తొలగించి అర్హులకు ఛాన్స్
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో
:- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్త పింఛన్లు అందించేందుకు నిర్ణయించింది. అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు దాటుతోంది. ఈ తరుణంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టింది. ఇప్పటికే పింఛన్ల అక్రమాలపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా నకిలీ పింఛన్లను అడ్డుకట్ట వేసింది. సంక్షేమ పథకాలు దుర్వినియోగం కాకూడదనే సంకల్పంతో అధికార యంత్రాంగం తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం లక్ష మందికి పైగా అనర్హులు పింఛన్లు పొందుతున్నట్లు గుర్తించింది. మరణించిన వారి పేరుతో కూడా పింఛన్లు అందుకుంటున్నట్లు ఈ విచారణలో తేలింది. అందుకే పింఛన్ల పేరుతో జరుగుతున్న అవినీతికి అడ్డుకట్ట వేయాలని భావిస్తోంది. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తాంది. లబ్ధిదారులు అసలు బతికే ఉన్నారా? లేదా? అని నిర్ధారించే లైఫ్ అథెంటికేషన్ ప్రక్రియను రాష్ట్రవ్యాప్తంగా తప్పనిసరి చేసింది. ఈ డిజిటల్ వెరిఫికేషన్ ద్వారా దొంగ పింఛన్ల దందా పూర్తిగా బయటపడుతోంది. చనిపోయిన వారి పేరుతో పింఛన్లు పొందడానికి గుర్తించి వాటిని రద్దు చేస్తోంది ప్రభుత్వం.

లక్షకు పైగా అనర్హులు..
రాష్ట్రవ్యాప్తంగా లక్షకు పైగా అనర్హుల పింఛన్లను ఏరివేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇలా తొలగిస్తున్న వారి పింఛన్ల స్థానంలో కొత్త వారికి అందించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. యాళ్ల తరబడి దరఖాస్తు చేసుకుని.. ఎదురుచూస్తున్న నిజమైన లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల మంది అర్హులను గుర్తించేందుకు గ్రామ/ వార్డు స్థాయిలో అధికారులు ఇప్పటికే సర్వే ప్రక్రియను ముమ్మరం చేశారు. దీనికి అదనంగా తాజాగా గుర్తించిన ఒక లక్ష మంది ఆనర్హుల స్థానంలో.. కొత్తవారికి అందించేందుకు నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు, నిధుల సర్దుబాటుపై రాష్ట్ర ఆర్థిక శాఖ ఇప్పటికే పూర్తిస్థాయి కసరత్తును పూర్తి చేసింది.

పేదలకు ఆర్థిక భరోసా..
తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయంతో రాష్ట్రంలో దాదాపు 3 లక్షల మంది పేదలకు ఆర్థిక భద్రత లభించనుంది. కొత్తగా పెన్షన్లు అందబోతుండడంతో యాళ్ల తరబడి కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్న వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, చేనేత, గీత కార్మికులు, హెచ్ఐవి బాధితులు, దివ్యాంగులకు సరికొత్త ఆశలు చిగురించాయి. ప్రభుత్వ నిర్ణయంతో వీరికి భారీ ఊరట దక్కనుంది. ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ జరుగుతుండడంతో.. పారదర్శకంగా.. పింఛన్ల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

హైదరాబాద్:బిర్యానీ.. ఓ ఎమోషన్!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు