Homeఅంతర్జాతీయంపాక్‌ ఉప ప్రధాని మనవడి దుశ్చర్య... విదేశీ మహిళపై గ్యాంగ్‌ రేప్‌...!

పాక్‌ ఉప ప్రధాని మనవడి దుశ్చర్య… విదేశీ మహిళపై గ్యాంగ్‌ రేప్‌…!

ఢిల్లీ, క్రైమ్‌మిర్ర‌ర్‌: పాకిసాథన్‌ ఉప ప్రధాని, విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్‌దార్‌ మనవడు దారుణానికి తెగబడ్డాడు. క్రిఫ్టో కరెన్సీ వ్యాపారం పేరుతో ఇతర దేశానికి చెందిన ఇద్దరు మహిళలను పాకిస్థాన్‌ రప్పించి ఆమెపై గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడ్డాడు. ప్రస్తుతం ఈ వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. వ్యాపారం కోసం వచ్చిన సదరు ఇద్దరు మహిళలను నమ్మించి పాకిస్తాన్‌ వచ్చిన తరువాత వారిని కిడ్నాప్‌ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

Also Read:Heartbreaking Incident: అపార్థం తెచ్చిన అనర్థం.. భర్త వాట్సప్‌ స్టేటస్‌ చూసి భార్య ఆత్మహత్య!

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పాక్‌ ఉప ప్రధాని ఇషాక్‌దార్‌ మనవడు ఉన్నట్టు పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో మహమద్‌ రజాదార్‌, హసన్‌ రజా, సికిందర్‌ ఖాన్‌, సాజిద్‌ అలీగా ఉన్నట్టు చెబుతున్నారు. వీరిని శుక్రవారం లాహోర్‌ కోర్టులో హాజరుపర్చగా, కోర్టు ఐదు రోజులు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వీరిలో ప్రధాన నిందితుడు మహ్మద్‌ రజాదార్‌ ప్రస్తుత పాకిస్థాన్‌ ఉప ప్రధాని ఇషాక్‌ ధార్‌ బందువు అని, వరసకు మనవడు అవుతాడని చెబుతున్నారు. ఈ కేసు ఉప ప్రధానితో ముడిపడి ఉండడంతో పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.

సింగపూర్‌లో పరిచయం.. లాహోర్‌లో అపహరణ…

Also Read:Indus Waters Treaty Row: ఉగ్రవాదం ఆగితేనే సింధు జలాలు.. పాక్‌కు భారత్ అల్టిమేటం!

నెదర్లాండ్స్‌, వెనుజులాకు చెందిన ఇద్దరు మహిళలకు ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న వారితో 2025లో సింగపూర్‌లో పరిచయం ఏర్పడింది. వీరిలో మహ్మద్‌ రజాదార్‌ను వారు సింగపూర్‌లో కలిశారు. వీరిద్దరిని పాకిస్తాన్‌కు రావాలని అప్పట్లో రజాదార్‌ ఆహ్వానించాడు. ఈ క్రమంలోనే ఇద్దరు మహిళలు క్రిప్టో కరెన్సీ వ్యాపారం పట్ల ఆసక్తి ఉందని తెలుసుకున్న రజాధార్‌ అదే పేరు చెప్పి నమ్మించే ప్రయత్నం చేశాడు. వ్యాపారం కోసం పాకిస్థాన్‌ రావాలని ఆహ్వానించాడు. రజాధార్‌ ఇద్దరు మహిళలకు బిజినెస్‌ వీసాలు ఏర్పాటు చేశాడు. జూన్‌ 29న ఇద్దరు కూడా లాహోర్‌ విమానాశ్రయానికి చేరుకున్న తరువాత అక్కడి నుంచి కిడ్నాప్‌ చేసి ఒక గదిలో బంధించారు.

Also Read:BMS Apps Ban: ఒక్క క్లిక్ తో ఈ-రిక్షా షట్‌ డౌన్.. కేంద్రం షాకింగ్ నిర్ణయం!

అక్కడే ఈ నలుగురు వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు విచారణలో గుర్తించారు. విడుదల చేయడానికి కూడా నిందితులు డబ్బులు డిమాండ్‌ చేసినట్టు బాధితులు చెబుతున్నారు. కోర్టు విచారణ సమయంలో రజాధార్‌ను ప్రధాన నిందితుడిగా ఇద్దరు మహిళలు వెల్లడించారు. ఈ ఘటన బాధితుల్లో ఒక అమ్మాయి తండ్రి స్పెయిన్‌ నుంచి పోలీసులకు ఫోన్‌ చేయడంతో ప్రమాదం విషయం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు వచ్చిన వెంటనే పోలీసులు వేగంగా స్పందించడంతో వారిద్దరిని సురక్షితంగా పట్టుకోగలిగారు. వీరిపై లాహోర్‌ పోలీసులు కిడ్నాప్‌. సామూహిక అత్యాచారం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

తాజావార్తలు