క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : పశ్చిమబెంగాల్లో కొత్తగా కొలువుదీరిన బిజెపి ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంది. ఉద్యోగులకు వరాల జల్లు కురిపించింది. పశ్చిమ బెంగాల్లోని బిజెపి ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఉద్యోగులకు భారీగా లబ్ధిని చేకూర్చే విధంగా బడ్జెట్లో కేటాయింపులు చేసింది. ఉద్యోగులతోపాటు పెన్షనర్లు, పాత్రికేయులకు లబ్ధి చేకూర్చేలా కీలక ప్రకటనలను ప్రభుత్వం చేసింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి స్వపన్ దాస్ గుప్తా తాజాగా అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశ పెడుతూ ఉద్యోగులకు కరువు భత్యం 20% పెంచినట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, టెన్షనర్లకు ప్రస్తుతం ఉన్న డి ఏ 18 శాతం నుంచి 38 శాతానికి చేరుకుంది.
నూతనంగా పెంచిన ఈ డి ఏ రేట్లు 2026 అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల వేలాదిమంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, జీవన్ గేయాల నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు చాలా కాలం నుంచి డిఏ పెంచాలని కోరుతూ వస్తున్నాయి. గతంలో మమతా బెనర్జీ సర్కార్ ఈ డిమాండ్లను పట్టించుకోలేదు. కానీ తాత ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం ఉద్యోగుల ఆకాంక్షలను నెరవేరుస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని లక్షలాదిమంది ఉద్యోగులు, టెన్షనర్లకు ఆర్థికంగా ఉపశమనం కలుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
అలాగే జర్నలిస్టులకు శుభవార్త అందించేలా ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. పదవి విరమణ చేసిన సీనియర్ జర్నలిస్టులకు 5000 చొప్పున పెన్షన్ అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మీడియా రంగంలో సేవలు అందించిన వారికి ఈ ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే మరో కీలక నిర్ణయానికి కూడా ప్రభుత్వం తీసుకుంది. వివిధ కారణాలతో జైలుకు వెళ్లిన రాజకీయ ఖైదీలకు కూడా ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజకీయ కారణాలతో జైలు శిక్ష అనుభవించిన వారికి నేలకు 10,000 చొప్పున పెన్షన్ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం తాజాగా కేటాయించను బడ్జెట్లో ఇది అత్యంత కీలకంగా నిలిచింది.
సంచలనంగా మారిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ బడ్జెట్..
ఇప్పటివరకు అనేక రాష్ట్రాలు బడ్జెట్లో ప్రవేశపెట్టాయి. కానీ తొలిసారి పశ్చిమబెంగాల్ ప్రభుత్వం బడ్జెట్లో కీలక రంగాలకు కేటాయింపులు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యంగా రాజకీయ ఖైదీలకు 10,000 చొప్పున పెన్షన్ ఇవ్వడానికి బడ్జెట్ కేటాయించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దేశంలో ఈ తరహాలో మరే రాష్ట్రంలోనూ పెన్షన్ ఇవ్వడం లేదని, ఈ నిర్ణయం తీసుకున్న తొలి రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ నిలుస్తుందని పలువురు పేర్కొంటున్నారు. అలాగే జర్నలిస్టులకు కూడా లబ్ధి చేకూర్చేలా పెన్షన్ అందించేందుకు నిధులు కేటాయించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
పశ్చిమ బెంగాల్లో అనూహ్యంగా విజయం సాధించిన బిజెపి కీలక నిర్ణయాలను తీసుకుంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బిజెపి వచ్చే లోక్సభ ఎన్నికల్లో కూడా మెజారిటీ స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా బడ్జెట్లో కీలక రంగాలకు నిధులను కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రాజకీయ ఖైదీలకు పెన్షన్ అందించడం, జర్నలిస్టులకు పెన్షన్ అందించేందుకు నిధులు కేటాయించడం వంటి నిర్ణయాలను తీసుకున్నట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించిన నిధులు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. ఉద్యోగులు, జర్నలిస్టులు, రాజకీయ ఖైదీలకు మేలును చేకూర్చేలా నిర్ణయం తీసుకోవడంతో భవిష్యత్తులో ఆయా వర్గాలు బిజెపికి అండగా నిలిచే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు.