Homeక్రైమ్Gang Rape Case: మహిళపై కిరాతకం.. మర్మాంగంలోకి ఆ వస్తువులను పెట్టి మరీ పైశాచికత్వం!

Gang Rape Case: మహిళపై కిరాతకం.. మర్మాంగంలోకి ఆ వస్తువులను పెట్టి మరీ పైశాచికత్వం!

బీహార్‌ బెగుసరాయ్‌లో జరిగిన దారుణ ఘటన తీవ్ర కలకలం రేపింది. బాధితురాలిపై కొందరు దుండగులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆమె మర్మాంగంలోకి పలు రకాలు వస్తువులను పెళ్లి రాక్షసుల మాదిరిగా ప్రవర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసుల వివరాల ప్రకారం, జూన్ 11 అర్థరాత్రి సమయంలో బాధితురాలు టాయిలెట్ కోసం ఇంటి బయటకు వెళ్లిన సమయంలో ఐదుగురు వ్యక్తులు ఆమెను బలవంతంగా లాక్కెళ్లారు. అడ్డుకోబోయిన ఆమె భర్తను బంధించారు. ఆమెను నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, ఒకరి తర్వాత మరొకరు అత్యాచారం చేశారు.  ఆమె కేకలు వేయడానికి ప్రయత్నించడంతో బ్లేడ్‌ తో ఆమె ఛాతి, తొడలపై తీవ్రంగా గాయపరిచారు. ఆ తర్వాత మరింత వికృత చేష్టలకు దిగారు. ఆమె మర్మాంగంలో బుల్లెట్, రాయి, చెక్క ముక్క వంటి వస్తువులు పెట్టారు. లైంగిక దాడి తర్వాత దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.

స్పృహలోకి వచ్చిన తర్వాత బాధితురాలు తన బంధువులకు ఫోన్ చేసింది. వారు వచ్చి మహిళను, ఆమె భర్తను రక్షించారు. బాధితురాలి భర్త వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. మొదట స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రికి తరలించారు. చికిత్స సందర్భంగా లైంగిక దాడి జరిగిన తీరును చూసి షాకయ్యారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు సమాచారం.

ఈ ఘటనపై స్పందించిన పోలీసులు, కేసును అత్యంత ప్రాధాన్యంతో విచారిస్తున్నామని తెలిపారు. నిందితులను గుర్తించి త్వరలోనే అరెస్టు చేస్తామని వెల్లడించారు. అలాగే బాధితురాలు గతంలో చేసిన కొన్ని ఫిర్యాదులపై కూడా విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. ఎక్కడైనా అధికారుల నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారి తీసింది. మహిళల భద్రత, నేరాల నియంత్రణపై మరోసారి చర్చ మొదలైంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు