Homeక్రైమ్చ‌త్తీస్‌గఢ్‌లో దారుణం...కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు...! ముగ్గ‌రు స‌జీవ దహ‌నం

చ‌త్తీస్‌గఢ్‌లో దారుణం…కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు…! ముగ్గ‌రు స‌జీవ దహ‌నం

రాయ‌పూర్‌,క్రైమ్‌మిర్ర‌ర్‌:చ‌త్తీస్‌ఘ‌డ్‌లో ఇసుక త‌వ్వ‌కాల్లో ఇరువ‌ర్గాల మ‌ధ్య త‌లెత్తిన వివాదం చివ‌ర‌కు ఘోర ఘ‌ట‌న‌కు దారి తీసింది. ఈ ఘ‌ట‌న‌లోస్థానిక నేత, జన్‌పద్ పంచాయతీ మాజీ ప్రెసిడెండ్ భరత్ సింగ్ సజీవదహనమయ్యారు. కాగా ఘ‌ట‌న కొరియా జిల్లాలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్టు చేశారు.

Also Read:ఓ వైపు ఎండలు, మరొక వైపు వర్షాలు!.. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం

వివ‌రాల ప్ర‌కారం స్థానికంగా ఇసుక తవ్వకాల కాంట్రాక్ట్‌ను భరత్ సింగ్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో మనోజ్ త్రిపాఠీ వర్గంతో భరత్‌ సింగ్‌కు వివాదం మొదలైంది. ఇసుక తవ్వకాల కోసం వాడే టిప్పర్ ట్రక్‌లు త్రిపాఠీ కుటుంబానికి చెందినవని స్థానికులు తెలిపారు. దీంతో, ఇసుక తరలింపు, చెల్లింపుల విషయంలో భరత్ సింగ్, త్రిపాఠీ వర్గాల మధ్య వివాదం మొదలైంది. చివరకు ఇది ఆధిపత్య పోరుగా మారినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

Also Read:అంతు చిక్కని అమ్మాయిల హత్యలు.. నిన్ననే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్

మంగళవారం రాత్రి ఇసుక తవ్వకాలకు సంబంధించి తలెత్తిన వివాదాన్ని పరిష్కరించేందుకు భరత్ సింగ్ నౌగెయిన్ గ్రామానికి వెళ్లారు. దీంతో, అక్కడ వివాదం చెలరేగగా భరత్ సింగ్ ప్రయాణిస్తున్న ఫార్చూనర్ కారును కొందరు అడ్డగించారు. తప్పించుకునే వీలులేకుండా కారుకు ముందు, వెనుక లారీలను అడ్డుపెట్టారు. ఆ తరువాత కారుపై పెట్రలో పోసి నిప్పటించడంతో భరత్ సింగ్ సజీవదహనమయ్యారు. భరత్ సింగ్‌తో పాటు కారులో ఉన్న విరేంద్ర సింగ్, నాగేంద్ర సింగ్ కూడా కాలిన గాయాలతో కన్నుమూశారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన మయాంక్ సింగ్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది.

Also Read:యాదగిరిగుట్టకు భక్తుల కానుకల వర్షం.. వరుసగా మూడో ఏడాది రూ.200 కోట్లకు పైగా!!

ఘటనపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని మృతుల కుటుంబం డిమాండ్ చేసింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్టు చేశామని ఏఎస్పీ సురేషా చౌబే తెలిపారు. మరికొందరు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలో పట్టుకుంటామని అన్నారు.

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు