క్రైమ్ మిర్రర్,న్యూఢిల్లీ:- ఢిల్లీలోని ప్రతిష్టాత్మక లుటియన్స్ జోన్లో ఓ బంగ్లా రికార్డ్ ధరకు అమ్ముడుపోయింది. ఎస్సెల్ గ్రూప్ చైర్మన్, జీ మీడియా కార్పొరేషన్ ఫౌండర్ సుభాష్ చంద్రకు చెందిన ఈ బంగ్లా ఏకంగా రూ. 1,260 కోట్లకు అమ్ముడుపోవడం విశేషం.ఇటీవల కాలంలో ఢిల్లీలో జరిగిన అతిపెద్ద రియల్ ఎస్టేట్ లావాదేవీ ఇదేనని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సుమారు 2.8 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ బంగ్లాను సుభాష్ చంద్ర 2015లో రూ. 304 కోట్లకు కొనుగోలు చేశారు. కేవలం ఎనిమిదేళ్ల వ్యవధిలో దీని విలువ నాలుగు రెట్లకు పైగా పెరగడం గమనార్హం.లుటియన్స్ జోన్ ఢిల్లీలోనే అత్యంత ఖరీదైన, ప్రతిష్టాత్మకమైన ప్రాంతం. సుమారు 3 వేల బంగ్లాలు ఉండే ఈ ఏరియాలో సీనియర్ అధికారులు, న్యాయమూర్తులు, దౌత్యవేత్తలు, బడా పారిశ్రామికవేత్తలు వంటి ప్రముఖులు మాత్రమే నివసిస్తారు. ఈ భారీ డీల్ రియల్ ఎస్టేట్ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
విశాఖ బీచ్‌లో ఇక చిల్ అవ్వాల్సిందే.. బీచ్ సాక్స్ ఏర్పాటుకు నిర్ణయం.!
ఏపీలో చచ్చిపోతున్నా పవన్‌కు కనపడదు: పేర్ని నాని ఫైర్