Homeజాతీయంవిమాన ప్రయాణీకులకు శుభవార్త.. తక్కువ బడ్జెట్‌తో బేసిక్‌ ఫేర్‌ కేటగిరీ.!

విమాన ప్రయాణీకులకు శుభవార్త.. తక్కువ బడ్జెట్‌తో బేసిక్‌ ఫేర్‌ కేటగిరీ.!

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : విమాన ప్రయాణీకులకు శుభవార్త. తక్కువ ధరతోనే విమానయానం చేసే అవకాశాన్ని విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా ప్రవేశపెట్టింది. దేశంలో విమాన ప్రయాణాలు సాగించే వారి సంఖ్యను మరింత పెంచే ఉద్ధేశంతో కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలిసింది. తక్కువ ధరలోనే విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చే ఉద్ధేశంతో టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్‌ ఇండియా సంస్థ అత్యంత ముఖ్యమైన నిర్ణయాన్ని ప్రకటించింది. తాజా నిర్ణయం ప్రకారం ఎంపిక చేసిన కొన్ని దేశీయ రూట్లలో ఎకనామీ క్లాస్‌ ప్రయాణీకులకు సరికొత్తగా బేసిక్‌ ఫేర్‌ కేటగిరీని ఈ సంస్థ ప్రవేశపెట్టింది. తక్కువ బడ్జెట్‌తో ప్రయాణాలు సాగించాలనుకునే వారికి ఎక్కువ ఆప్షన్లు కోరుకునే వారికి ఈ సరికొత్త ప్లాన్‌ ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. ఈ బేసిక్‌ పేర్‌ కింద టికెట్‌ బుక్‌ చేసుకునే ప్రయాణీకులకు 15 కిలోల చెక్‌ ఇన్‌ లగేజీ, ఏడు కిలోల క్యాబిన్‌ లగేజీ అనుమతితోపాటు విమానంలో ఉచితంగా టీ లేదా కాఫీ సర్వీస్‌ అందించనున్నట్టు ఈ సంస్థ వెల్లడించింది. మిగిలిన క్లాసులు మాదిరిగా ఈ బేసిక్‌ టికెట్‌ ధరలో ఉచిత భోజన సదుపాయం ఉండదు.

అవసరాలు.. ప్రాధాన్యతను బట్టి..

వినియోగదారుల విభిన్న అవసరాలు, ప్రాధాన్యతలను గుర్తించి వారి బడ్జెట్‌కు అనుగుణంగా ఎయిర్‌ ఇండియా ఈ ప్రో కన్జ్యూమర్‌ విధానాన్ని తీసుకువచ్చినట్టు వెల్లడించింది. ప్రస్తుతానికి ఈ బేసిక్‌ ఫేర్‌ కేటగిరీ కఏవలం ఎయిర్‌ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌, కస్టమర్‌ కేర్‌ సెంటర్‌, ఎయిర్‌ పోర్టు టికెటింగ్‌ ఆఫీసులు వంటి డైరక్టర్‌ చానెళ్ల ద్వారా మాత్రమే అందుబాటులో ఉంది. ట్రయల్‌ రన్‌లో భాగంగా దీనిపై వచ్చే కస్టమర్ల ఫీడ్‌బ్యాక్‌ను పరిశీలించిన తరువాత అన్ని రూట్లలో ఈ బేసిక్‌ ఫేర్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్టు సంస్థ వెల్లడించింది. దీనిపై కూడా ఆలోచన చేస్తున్నట్టు సంస్థ వెల్లడించింది. బేసిక్‌ ఫేర్‌ ఎంచుకున్న వినియోగదారులకు బోజనం కావాలంటే విమానం బయలుదేరడానికి 24 గంటలు ముందే వెజిటేరియన్‌, నాన్‌ వెజిటేరియన్‌, జైన్‌ లేదా డయాబెటిక్‌ మీల్స్‌ ఆప్షన్లను డబ్బులు చెల్లించి బుక్‌ చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ విమాన షెడ్యూల్‌లో మార్పులు జరిగితే ఈ ఫ్రీ బుక్డ్‌ భోజనాన్ని తదుపరి విమానానికి బదిలీ చేయనున్నారు. లేకపోతే డబ్బులు రీఫండ్‌ చేయనున్నట్టు సంస్థ వెల్లడించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు