క్రికెట్‌కు వీడ్కోలు పలికినా ఆ ఆటపై తనకున్న మమకారం ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించారు భారత క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేస్తూ కూడా క్రికెట్‌ను ఆస్వాదించిన ఆయన తాజాగా చేసిన సరదా పని అభిమానుల హృదయాలను గెలుచుకుంది. ప్రైవేట్ జెట్‌లో ప్రయాణిస్తున్న సమయంలో విమానం లోపలే బ్యాట్ పట్టుకుని చిన్నపాటి క్రికెట్ మ్యాచ్ ఆడిన సచిన్, ఆ వీడియోను అభిమానులతో పంచుకోవడంతో అది క్షణాల్లోనే వైరల్‌గా మారింది.
Altitude jo bhi ho, attitude change nahi hona chahiye. 😄 pic.twitter.com/TPbsNUe2Op
— Sachin Tendulkar (@sachin_rt) June 12, 2026
తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఈ వీడియోను పంచుకున్న సచిన్, “ఎత్తు ఎంత పెరిగినా మన స్వభావం మాత్రం మారకూడదు” అనే భావంతో కూడిన సందేశాన్ని జత చేశాడు. వీడియోలో సచిన్ ప్రైవేట్ జెట్‌లో బ్యాటింగ్ చేస్తుండగా, ఆయన కోడలు సానియా చందో సరదాగా బంతులు వేస్తూ కనిపించింది. కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఈ చిన్న మ్యాచ్‌లో అందరూ ఉత్సాహంగా పాల్గొనడం అభిమానులను ఆకట్టుకుంది.
మరోవైపు సచిన్ కుమార్తె సారా టెండూల్కర్ వికెట్ కీపర్, ఫీల్డర్ పాత్రల్లో కనిపించింది. ఒక బంతి సచిన్ బ్యాట్‌ను తాకకుండా వెళ్లిపోవడంతో సారా అంపైర్‌లా గట్టిగా అవుట్ అంటూ అప్పీల్ చేయడం వీడియోలో నవ్వులు పూయించింది. దీనికి స్పందించిన సచిన్ సరదాగా “నన్ను అవుట్ చేయడం అంత ఈజీ కాదు, నన్ను ఎవరూ అవుట్ చేయలేరు” అంటూ చమత్కరించాడు. ఆ తర్వాత బ్యాట్‌ను తిరగేసి హ్యాండిల్ భాగంతో ఆడుతూ “ఇలా ఆడితేనే నాకు అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది” అని చెప్పడంతో విమానంలో ఉన్నవారంతా నవ్వుల్లో మునిగిపోయారు.
అయితే మ్యాచ్‌లో అసలు ట్విస్ట్ ఆ తర్వాతే వచ్చింది. బ్యాట్‌ను తిరగేసి ఆడుతున్న సమయంలో సచిన్ కొట్టిన బంతి గాల్లోకి ఎగిరింది. మొదటిసారి క్యాచ్‌ను వదిలేసిన సారా, తర్వాతి బంతికి మాత్రం అద్భుతంగా క్యాచ్ అందుకుని గాల్లోకి ఎగురుతూ ఆనందం వ్యక్తం చేసింది. “అవుట్” అంటూ సంబరాలు చేసుకోవడంతో సచిన్ కూడా నవ్వుతూ తన ఓటమిని అంగీకరించాడు. తండ్రి, కూతురు మధ్య జరిగిన ఈ ఆహ్లాదకరమైన సంఘటన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ అయిన కొద్ది సమయంలోనే 1.5 మిలియన్లకు పైగా వీక్షణలు సాధించి విస్తృతంగా చర్చనీయాంశమైంది. అభిమానులు కూడా సరదా వ్యాఖ్యలతో స్పందిస్తున్నారు. ఒకరు “సార్ బయట ఆడితే బాగుంటుంది, లోపల గాజు అద్దాలు పగిలిపోతే ఖర్చు ఎక్కువ అవుతుంది” అని వ్యాఖ్యానించగా, మరొకరు “మీరు బ్యాట్ హ్యాండిల్‌తో ఆడినా బంతి మధ్యలోనే తగులుతోంది, అందుకే మిమ్మల్ని క్రికెట్ దేవుడు అంటారు” అంటూ ప్రశంసించారు. క్రికెట్ పట్ల సచిన్‌కు ఉన్న ప్రేమ, అంకితభావం ఎప్పటికీ తగ్గదని ఈ వీడియో మరోసారి నిరూపించిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
ALSO READ: మళ్లీ ప్రారంభమైన శుభముహూర్తాల సీజన్