Homeవైరల్ప్రాణాల కోసం పోరాడిన చిన్నారి... ఆఖరి క్షణంలో కాపాడిన భారతీయుడు

ప్రాణాల కోసం పోరాడిన చిన్నారి… ఆఖరి క్షణంలో కాపాడిన భారతీయుడు

లండన్ నగరంలో గుండె ఆగిపోయేలా చేసే ఘటన చోటుచేసుకుంది. ఒక్క క్షణం ఆలస్యం అయినా పెద్ద ప్రమాదం జరిగేదీ… కానీ, ఓ భారతీయ యువకుడి ధైర్యం, సమయస్ఫూర్తి ఓ చిన్నారి ప్రాణాలను కాపాడింది.

ఇల్‌ఫోర్డ్ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్ భవనంలో ఈ సంఘటన జరిగింది. కేవలం మూడేళ్ల చిన్నారి… ఎవరూ ఊహించని విధంగా కిటికీ అంచుకు చేరి, అక్కడి నుంచి జారి బయటకు వేలాడుతూ ప్రాణాపాయ స్థితిలో పడిపోయింది. కింద ఉన్నవారు చూస్తూ భయంతో గట్టిగా అరిచారు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేస్తే ఆ చిన్నారి కింద పడిపోయే ప్రమాదం స్పష్టంగా కనిపించింది.

అదే సమయంలో అక్కడ సమీపంలో ఉన్న భారతీయ రెస్టారెంట్ మేనేజర్ మహ్మద్ జెసిల్ పరిస్థితిని గమనించాడు. ఆలోచించడానికి కూడా టైం లేకుండా వెంటనే చర్య తీసుకున్నాడు. అక్కడే ఉన్న ఓ పోలీస్ అధికారి సహాయంతో ఇద్దరూ కలిసి ఆ చిన్నారిని కాపాడారు.

చిన్నారి దాదాపు తొమ్మిది నిమిషాల పాటు కిటికీ అంచున వేలాడుతూ ఉండగా… కింద నుంచి ఇద్దరూ జాగ్రత్తగా గమనిస్తూ సరైన సమయాన్ని చూసి గాల్లోనే పట్టుకుని రక్షించారు. ఆ క్షణం అక్కడున్న ప్రతి ఒక్కరి గుండెల్లో ఊపిరి ఆగిపోయినట్టే అయ్యింది.

చివరికి చిన్నారి సురక్షితంగా రక్షించబడింది. అక్కడున్న ప్రజలు నిట్టూర్పు విడిచారు. మహ్మద్ జెసిల్ ధైర్యానికి, సమయస్ఫూర్తికి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. “రియల్ హీరో” అంటూ నెటిజన్లు మహ్మద్ జెసిల్‌ను కొనియాడుతున్నారు. మనుషుల్లో ఇంకా మానవత్వం బ్రతికే ఉందని ఈ ఘటన మరోసారి నిరూపించింది.

ALSO READ: సి-సెక్షన్ తర్వాత కిడ్నీ సమస్యలు వస్తాయా ? గర్భిణీలు తప్పక తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు