Homeఅంతర్జాతీయంక్రికెట్ ప్రపంచంలో క్లాస్ ప్లేయర్‌.. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై!!!

క్రికెట్ ప్రపంచంలో క్లాస్ ప్లేయర్‌.. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై!!!

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : క్రికెట్ ప్రపంచంలో క్లాస్ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 16 సంవత్సరాల పాటు సాగిన తన సుదీర్ఘ అద్భుత కెరీర్‌కు ఆయన ముగింపు పలికారు. కివీస్ జట్టు తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం 378 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన కేన్.. తన రిటైర్మెంట్ ప్రకటనతో కోట్లాది మంది క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేశారు. ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టు ఇంగ్లాండ్‌లో టెస్ట్ సిరీస్ ఆడుతోంది. మొదటి టెస్ట్ మ్యాచ్‌లో కివీస్ జట్టు ఓడిపోవడంతో ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్ జరుగుతుండగానే విలియమ్సన్ ఈ ఊహించని నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం. చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌నే తన కెరీర్‌లో ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్‌గా ఆయన పేర్కొన్నారు. ఈ సిరీస్‌లోని మిగిలిన మ్యాచ్‌లలో ఆయన ఆడటం లేదు. సరైన సమయంలోనే తాను తప్పుకుంటున్నానని సంతోషంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విలియమ్సన్ స్పష్టం చేశారు. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు విడుదల చేసిన అధికారిక ప్రకటనలో విలియమ్సన్ తన భావాలను పంచుకున్నారు.

“గత కొన్ని రోజులుగా ఆలోచించిన తర్వాత, అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయమని నాకు స్పష్టమైంది. దేశం తరఫున ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ నా వంద శాతం శ్రమను అందించాను. అంతకంటే తక్కువ ఎఫర్ట్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు. అందుకే నా సొంత నిర్ణయంతో, గౌరవంగా తప్పుకుంటున్నాను. ప్రస్తుతం ఉన్న న్యూజిలాండ్ జట్టులో అద్భుతమైన టాలెంట్ ఉంది. భవిష్యత్తులో ఈ టీమ్ మరిన్ని గొప్ప విజయాలు సాధిస్తుందని నమ్ముతున్నాను. నా గుండెల్లో ఎప్పటికీ న్యూజిలాండ్ జట్టుకు ప్రత్యేక స్థానం ఉంటుంది” అని కేన్ ఎమోషనల్ అయ్యారు. కేన్ విలియమ్సన్ రిటైర్మెంట్‌పై న్యూజిలాండ్ హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ స్పందిస్తూ.. కేన్ కేవలం ఒక అద్భుతమైన ఆటగాడు మాత్రమే కాదు, అంతకంటే గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఎల్లప్పుడూ జట్టు ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యత ఇచ్చే కేన్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని చెప్పారు. అలాగే కివీస్ క్రికెట్ లెజెండ్ సర్ హాడ్లీ కూడా విలియమ్సన్‌ను ఆకాశానికెత్తారు. తన కాలంలోని అత్యుత్తమ ప్రపంచ స్థాయి ఆటగాళ్లలో కేన్ ఒకరని, మానసికంగా, శారీరకంగా ఆయన మ్యాచ్‌లకు సిద్ధమయ్యే విధానం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని కొనియాడారు. న్యూజిలాండ్ క్రికెట్‌కు ఆయన అందించిన సేవలకు కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు