Hometelanganaటీఆర్ఎస్ పార్టీకి ఊహించని అడ్డంకులు.. రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ

టీఆర్ఎస్ పార్టీకి ఊహించని అడ్డంకులు.. రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఎమ్మెల్సీ కవిత కొత్త రాజకీయ పార్టీ పేరు చుట్టూ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ‘తెలంగాణ రక్షణ సేన’ పార్టీకి ఊహించని అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ పేరుపై ఇప్పటికే పలు అభ్యంతరాలు కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి వెళ్లడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కవిత పార్టీ ప్రకటనకు ముందే మహారాష్ట్రలోని సోలాపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ‘తెలంగాణ రాష్ట్రసామాజిక సేన’ కూడా ‘టీఆర్ఎస్’ అనే పేరు తమ పార్టీకి కేటాయించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించినట్లు సమాచారం. సోలాపూర్‌కు చెందిన దయానంద్ మహాదేవ్ మామ్‌డ్యాల్ ఈ మేరకు కవిత పార్టీ ప్రకటనకు ఒక రోజు ముందే ఈసీఐకి దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. ఇక కవిత పార్టీ పేరుపై భారత్ రాష్ట్ర సమితి కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 14 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అనే పేరు తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందని, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బీఆర్ఎస్‌ను ‘టీఆర్ఎస్’గానే గుర్తిస్తున్నారని పేర్కొంటూ ఆ పేరును ఇతరులకు కేటాయించవద్దని ఈసీఐకి అధికారిక ఫిర్యాదు చేసింది.

అంతేకాకుండా, కవిత పత్రికల్లో ఇచ్చిన ప్రకటనపై కూడా పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. టీఆర్ఎస్ పేరును కేటాయించడంపై దాదాపు 600 నుంచి 700 వరకు ప్రజా అభ్యంతరాలు ఎన్నికల సంఘానికి అందినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద ఇప్పటికే టీఆర్ఎస్ పేరుతో నమోదైన మరికొన్ని రాజకీయ పార్టీలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ‘తెలంగాణ రాజ్య సమితి’ పేరుతో నమోదైన మరో రాజకీయ పార్టీ కూడా టీఆర్ఎస్ పేరును ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ఈ వివాదంపై వివరణ ఇచ్చేందుకు కవిత ప్రతినిధుల బృందం కూడా ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. భారీ సంఖ్యలో అభ్యంతరాలు వ్యక్తమవుతుండటంతో కవిత కొత్త రాజకీయ పార్టీకి ‘టీఆర్ఎస్’ పేరు దక్కుతుందా లేదా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు