Hometelanganaమేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణపై మంత్రి ఉత్తమ్ సమీక్ష..

మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణపై మంత్రి ఉత్తమ్ సమీక్ష..

క్రైమ్ మిర్రర్, భూపాలపల్లి ప్రతినిధి : మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులను 2027 ఎండాకాలం నాటికి పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం మేడిగడ్డలో జరుగుతున్న సాంకేతిక పరీక్షలను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ, ప్రాజెక్టు కుంగిపోవడానికి గల కారణాలను గుర్తించేందుకు సీడబ్ల్యూసీ, ఎన్‌డీఎస్‌ఏ వంటి నిపుణ సంస్థలతో పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పరీక్షల నివేదికల ఆధారంగా పునరుద్ధరణ డిజైన్ రూపొందించి, కేంద్ర సంస్థల అనుమతులు పొందిన తర్వాత నవంబర్–డిసెంబర్‌లో మరమ్మతు పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. ప్రపంచ ప్రఖ్యాత ఆఫ్రిన్ సంస్థ, ఐఐటీ బాంబే నిపుణుల సహకారంతో రీడిజైన్ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఒకే వర్కింగ్ సీజన్‌లో పనులు పూర్తి చేసి 2027 నాటికి మేడిగడ్డను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు