Homeఆంధ్ర ప్రదేశ్ఏపీలో అట్టహాసంగా యోగాంధ్ర వేడుకలు.. చీఫ్ గెస్ట్ గా రాందేవ్ బాబా

ఏపీలో అట్టహాసంగా యోగాంధ్ర వేడుకలు.. చీఫ్ గెస్ట్ గా రాందేవ్ బాబా

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్ :- ఏపీలో యోగాంధ్ర వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 21న జరిగే రాష్ట్రస్థాయి యోగాంద్ర కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఇప్పటికే అనేక ఏర్పాట్లను ప్రభుత్వం చేసింది. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా పతంజలి సంస్థల వ్యవస్థాపకుడు, ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబాను ఆహ్వానించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆహ్వానానికి సంబంధించిన వివరాలను తాజాగా వెల్లడించారు. రాష్ట్రస్థాయిలో నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమంలో రామ్ దేవ్ బాబాతో పాటు వివిధ యోగా సంఘాల ప్రతినిధులు పాల్గొని ఆసనాలు వేయనున్నారని వెల్లడించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు యోగ నేచురోపతి ప్రభుత్వ సలహాదారు మంతెన సత్యనారాయణ రాజు, ఆయుష్ అధికారులు హరిద్వార్ వెళ్లే రాందేవ్ బాబాను ఆహ్వానించనున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు ఈ బృందం ఆయనకు ఆహ్వాన పత్రికను అందించేందుకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే యోగ ఆంధ్ర 2026 రిజిస్ట్రేషన్ లకు భారీ సంఖ్యలో స్పందన లభిస్తోంది. ఈ నెల ఏడో తేదీ నుంచి రిజిస్ట్రేషన్లను ప్రారంభించగా స్వల్ప వ్యవధిలోనే ఐదు లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. తొలి రోజు 25,000 మంది మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోగా సోమవారం నుంచి ఈ సంఖ్య గణనీయంగా పెరిగింది. యోగాసనాల్లో కోటి మందిని భాగస్వాములను చేయాలన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా గుంటూరు జిల్లాలో 98,000 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. ఆ తరువాత నెల్లూరు, నంద్యాల, కర్నూలు, పల్నాడు జిల్లాలో ఎక్కువ మంది పేర్లు నమోదు చేసుకున్నారని ఆయుష్ అధికారులు వెల్లడిస్తున్నారు. మరోవైపు యోగాంధ్ర కార్యక్రమాల్లో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లోని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొనాలని తాజాగా విద్యాశాఖ ఆదేశించింది. యోగాంధ్రకు ముందు నిర్వహించే ప్రాక్టీస్ సెషన్లను పాల్గొనాలని దీనికి వ్యాయామ ఉపాధ్యాయులు బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు జరిగే యోగాంద్ర కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు అయ్యేలా చూడాలని అందులో వెల్లడించింది.

జిల్లా స్థాయిలోనూ పెద్ద ఎత్తున ఏర్పాట్లు..

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాస్థాయిలో నిర్వహించే యోగా ఆంధ్ర వేడుకలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. ప్రతి జిల్లాలోనూ కనీసం 20 నుంచి 30 వేల మందితో భారీ కార్యక్రమాన్ని నిర్వహించేలా ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. గడిచిన ఏడాది కూడా ప్రపంచ రికార్డును సృష్టించేలా ఏపీలో యోగాంధ్ర వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అప్పట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా విశాఖలో జరిగిన యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఏడాది కూడా భారీ ఎత్తున నిర్వహించే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. మరికొన్ని రోజులు సమయం ఉన్న నేపథ్యంలో యోగాంధ్ర రిజిస్ట్రేషన్ లో పది లక్షలు దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే దేశంలోనే ఎక్కువ మందితో నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమం గా ఇది నిలుస్తుందని అధికారులు చెబుతున్నారు. అందుకు అనుగుణంగానే అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు. అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లేలా ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఆయుష్ డిపార్ట్మెంట్ నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు జిల్లా స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి జిల్లాలోనూ ఒక భారీ వేదికను సిద్ధం చేస్తున్నారు అక్కడే పెద్ద ఎత్తున యోగాసనాలు వేయనున్నారు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు