Hometelanganaతెలంగాణ ప్రతిష్ట పెంచిన బ్యాంక్..జాతీయ స్థాయిలో మూడు అవార్డులు

తెలంగాణ ప్రతిష్ట పెంచిన బ్యాంక్..జాతీయ స్థాయిలో మూడు అవార్డులు

  • తెలంగాణ ప్రతిష్ట పెంచిన బ్యాంక్..

  • పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌కు జాతీయ స్థాయిలో మూడు అవార్డులు

క్రైమ్ మిర్రర్, భూదాన్ పోచంపల్లి: తెలంగాణకు గర్వకారణమైన ఘట్టం చోటుచేసుకుంది. పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుకుంటూ మూడు ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో నిర్వహించిన జాతీయ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకుల సమ్మేళనం–2026లో ఈ ఘనత సాధించింది.

జూన్ 5 నుంచి 7 వరకు జరిగిన ఈ మహాసమ్మేళనంలో దేశవ్యాప్తంగా ఉన్న అనేక అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకులు పాల్గొన్నాయి. ఇందులో పోచంపల్లి బ్యాంక్ అత్యుత్తమ ప్రదర్శనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బ్యాంక్‌కు ‘బెస్ట్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్’, ‘బెస్ట్ చైర్మన్ ఆఫ్ ది ఇయర్’ (తడక రమేష్), అలాగే ‘బెస్ట్ ఎన్‌పీఏ మేనేజ్‌మెంట్’ అవార్డులు లభించాయి.

Also Read: Narendra Modi: నెహ్రూ రికార్డుకు చెక్.. అత్యధిక కాలం ప్రధానిగా మోదీ అరుదైన ఘనత!

ఈ అవార్డులను లక్నోలో జరిగిన ప్రధానోత్సవంలో అక్కడి ఎమ్మెల్యే పుకాన్ చేతుల మీదుగా బ్యాంక్ చైర్మన్ తడక రమేష్, సీఈవో సీత శ్రీనివాస్ అందుకున్నారు. బ్యాంక్ పనితీరు, ఆర్థిక నిర్వహణలో క్రమశిక్షణ, ఎన్‌పీఏలను సమర్థంగా నియంత్రించడం వంటి అంశాలు ఈ అవార్డులకు కారణమయ్యాయి.

ఈ విజయంపై ఖాతాదారులు, వాటాదారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, బ్యాంక్ సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంక్ అభివృద్ధికి కృషి చేసిన పాలకవర్గం మరియు సిబ్బందిని పలువురు అభినందిస్తున్నారు. ఈ జాతీయ గుర్తింపు, భవిష్యత్తులో మరింత సేవా కార్యక్రమాలు విస్తరించేందుకు ప్రేరణగా నిలుస్తుందని భావిస్తున్నారు.

Also Read: కడప టిడిపిలో రాజ్యసభ సెగ.. తీవ్ర అసంతృప్తిలో రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి..!

ఈ కార్యక్రమంలో బ్యాంక్ వైస్ చైర్మన్ భారత రాజేంద్రప్రసాద్‌తో పాటు డైరెక్టర్లు కర్నాటి బాలసుబ్రమణ్యం, ఏలే హరి శంకర్, సురపల్లి రమేష్, రాపోలు వేణు, గుండు కావ్య, కర్నాటి భార్గవి, బిట్టు భాస్కర్, మక్తాల నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Also Read: ఈ ప్రదేశాలు చూస్తే స్విట్జర్లాండ్ కూడా గుర్తుకురాదు…!

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు