-
పశ్చిమ ఆఫ్రికాలో ఘోరం..
-
నీరు లేక 49 మంది మృత్యువాత…!
Crime Mirror,Updates: ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో నీటి కొరత తీవ్రంగా వేధిస్తోంది. తాగేందుకు నీళ్లు లేక అనేక దేశాలకు చెందిన ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలోనే పశ్చిమ ఆఫ్రికాలో అత్యంత విషాదకరణ ఘటన చోటుచేసుకుంది. సహారా ఎడారిలో తాగేందుకు నీరు దొరకక దాహంతో 49 మంది ప్రాణాలను కోల్పోయారు.
వీరు ప్రయాణిస్తున్న ట్రక్కు ఆగిపోవడంతో వీరంతా కొన్ని రోజులు పాటు ఎడారిలో నిలిచిపోయినట్లు తెలుస్తోంది. పశ్చిమ ఆఫ్రికాలోని నైజర్ దేశంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకెళ్తే.. నైజర్ దేశానికి చెందిన కొంతమంది కుటుంబ సభ్యులు తమ బంధువులతో కలిసి పండుగ చేసుకునేందుకు పక్కన ఉన్న మాలి దేశానికి ట్రక్కులో బయలుదేరారు.
ఈ వేడుక ముగించుకొని తిరిగి వస్తుండగా వేరు ప్రయాణిస్తున్న ట్రక్కు అసమాకా అనే సరిహద్దు ప్రాంతానికి 80 కిలోమీటర్ల దూరంలో నిలిచిపోయింది. అయితే ఈ ప్రాంతం నిర్మాణస్యంగా ఉండడంతో సాయం చేసేవారు వాళ్లకు దొరకలేదు. డ్రైవర్ తో పాటు అందులోని ప్రయాణికులు ట్రక్కును మరమ్మతు చేసేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. దీంతో వారంతా కొన్ని రోజులు పాటు ఎడారిలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అప్పటికే వారి వద్ద ఉన్న నీటి నిల్వలో నిండుకోవడంతో ఎడారిలో నీటి జాడ లేకపోవడంతో వారి దాహాన్ని తీర్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. తీవ్రమైన ఎండ వలన ఏర్పడిన దాహంతో వారు అల్లాడిపోయారు. ఈ క్రమంలోనే సొమ్మసిల్లి పడిపోతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరకు ఇద్దరు వ్యక్తులు దాదాపు 50 కిలోమీటర్ల పైగా కాలినడక వెళ్లి నీరు తాగి అక్కడి నుంచి అసమాకా పట్టణానికి చేరుకున్నారు. అక్కడ అధికారులు కలిసి విషయం తెలియజేశారు.
అధికారులు వచ్చేసరికి జరిగిపోయిన నష్టం..
సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడికి బయలుదేరారు. సదరు వ్యక్తులు ఉన్న ప్రాంతానికి అధికారులు చేరుకునేసరికి అక్కడ హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. ట్రక్కు చుట్టూ డజన్ల కొద్ది మృతదేహాలు కనిపించినట్లు అధికారులు వెల్లడించారు. విపరీతమైన వేడి, ఒక్క పూత, తాగేందుకు నీరు లేకపోవడంతో 49 మంది ప్రాణాలను కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.
ట్రక్కు ఆగిపోవడానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. అయితే ఎడారిలో ఎన్ని రోజులు చిక్కుకుపోయారు అన్నదానిపై స్పష్టత రాలేదు. సాధారణంగా ఈ ఎడారి జోన్ మీదుగా పౌరులు రాకపోకలు సాగించడం చాలా అరుదు అని స్థానిక అధికారులు చెబుతున్నారు. ఎక్కువ ఆఫ్రికా దేశాల నుంచి యూరప్కో వలస వెళ్లేవారు ఈ మార్గాన్ని ఆశ్రయిస్తారని చెబుతున్నారు.
గతంలోనూ అనేకమంది ఇసుక వేడి, దాహం, ఆకలితో ఈ మార్గంలో ఎంతోమంది ప్రాణాలను కోల్పోయినట్లు చెబుతున్నారు. దాహం తీర్చుకోలేక 49 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎడారి ప్రాంతంలో ప్రయాణించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ప్రయాణాలు సాగించడం వలన ప్రాణాలను కోల్పోవాల్సి వస్తుందన్న విషయాన్ని ఈ ఘటన మరోసారి నిర్ధారించింది. ఈ తరహా ప్రయాణాలు సాగించేవారు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.